Begin typing your search above and press return to search.

ఇటలీలో చరణ్-ఉపాసనల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్..!

By:  Tupaki Desk   |   14 Jun 2022 8:33 AM GMT
ఇటలీలో చరణ్-ఉపాసనల వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్..!
X
ఇవాళ మెగా కపుల్ రామ్ చరణ్ - ఉపాసనల పెళ్లిరోజు. ఇది వారికి 10వ వెడ్డింగ్ యానివర్సరీ కూడా. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (2012 జూన్ 14) ఈ జంట వివాహ బంధంలో అడుగుపెట్టారు. చెర్రీ - ఉపాసనలు ఎంతో అన్యోన్యంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ లో ఒకరిగా నిలిచారు. కుటుంబం పట్ల మాత్రమే కాదు.. ఈ సమాజం పట్ల కూడా ఇద్దరూ చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ వైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటే.. మరోవైపు మెగా కోడలిగా అపోలో హాస్పిటల్స్ వైస్-ఛైర్ పర్సన్ గా మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వర్తించడమే కాదు.. సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది ఉపాసన కొణిదెల. 10వ పెళ్లిరోజు అంటే చాలా స్పెషల్ కాబట్టి.. దాన్ని మరింత స్పెషల్ గా మార్చడానికి ఈ మెగా కపుల్.. అన్నింటికీ బ్రేక్ ఇచ్చి కొన్ని రోజుల ముందుగానే ఇటలీలో వాలిపోయారు.

చెర్రీ - ఉపాసన ఇద్దరూ ఇటలీలోని ఫ్లోరెన్స్ లో తమ జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్టుగా రామ్ చరణ్ తన సతీమణితో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఇందులో చరణ్ - ఉపాసన జంట వైట్ అండ్ వైట్ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఉపాసన ఒక పెద్ద టోపీని ధరించి కనిపించింది. చెర్రీ సైతం చిన్న రౌండ్ టోపీ పెట్టుకొని.. 'బ్రింగ్ మీ టు ద మూన్' వైట్ షర్ట్ తో ఫ్యాషన్ ప్రియుల దృష్టిని కూడా ఆకర్షించాడు. చూట్టూ పచ్చని చెట్లు.. గార్డెన్ మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూ దిగిన ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది.

రామ్ చరణ్ - ఉపాసనల 10వ వివాహ వార్సికోత్సవాన్ని మెగా అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి వెడ్డింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పి.. పేరెంట్స్ గా మారాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గతంలో ఉపాసన ఒక సందర్భంలో మాట్లాడుతూ.. పిల్లలు - ప్రెగ్నెన్సీ అనేది మా వ్యక్తిగత విషయమని చెప్పింది. ఇద్దరికీ ఆ విషయంలో ఒక ప్లాన్ ఉందని.. పిల్లల్ని విషయపై ఒక క్లారిటీ ఉందిని తెలిపింది. పర్సనల్ అని చెప్పినప్పటికీ.. పదేళ్లుగా హ్యాపీగా సాగిపోతున్న వీరి వివాహ బంధంలోకి పిల్లలు కూడా వస్తే, జీవితంలో మరిన్ని మధురమైన క్షణాలను ఆస్వాదించవచ్చని మెగా ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల RRR చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న RC15.. శంకర్ శైలి పొలిటికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. దీని తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చరణ్ ఓ మూవీ కోసం వర్క్ చేయనున్నారు.