Begin typing your search above and press return to search.
పునీత్ రాజ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన చరణ్
By: Tupaki Desk | 3 Nov 2021 7:13 AM GMTకన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి మొత్తం దేశ వ్యాప్తంగా శోఖం ను మిగిల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆయన్ను చూడ్డం కోసం అభిమానులు లక్షల మంది తరలి వచ్చారు.. సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు వేలాది మంది బెంగళూరుకు క్యూ కట్టారు. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి.. బాలకృష్ణ.. ఎన్టీఆర్ లతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ మృత దేహంను సందర్శించి నివాళ్లు అర్పించారు. ఆ సమయంలో అందుబాటులో లేని కొందరు సినీ ప్రముఖులు ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.
ఇటీవలే నాగార్జున బెంగళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెల్సిందే. తాజాగా నేడు పునీత్ రాజ్ కుమార్ కుటుంబంను పరామర్శించేందుకు గాను రామ్ చరణ్ బెంగళూరు వెళ్లారు. అక్కడ పునీత్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు. పునీత్ రాజ్ కుమార్ తో తనకు ఉన్న అనుబంధంను చరణ్ నెమరవేసుకున్నట్లుగా తెలుస్తోంది. పునీత్ కుటుంబ సభ్యులను చరణ్ కలిసిన సమయంలో ఎమోషనల్ అయ్యారట. పునీత్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయి అమెరికా నుండి తండ్రి మృతి చెందిన తర్వాత వచ్చారు. ఇక పునీత్ అన్న శివరాజ్ కుమార్ ను కూడా పలువురు సినీ ప్రముఖులు ఈ సందర్బంగా పరామర్శిస్తున్నారు.
రామ్ చరణ్ మొన్నటి వరకు పుణె లో శంకర్ సినిమా చిత్రీకరణ లో పాల్గొన్నారు. ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను ముగించుకున్న తర్వాత పునీత్ రాజ్ కు మార్ ఇంటికి వెళ్లి చరణ్ పరామర్శించారని తెలుస్తోంది. మరో వైపు చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వచ్చే జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్దం అవుతోంది. భారీ అంచనాలున్న ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా ఈ సినిమా ను రాజమౌళి తెరకెక్కించాడు. ఇటీవల విడుదల అయిన గ్లిమ్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి అనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్ విడుదల కాబోతుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లో భారీగా విడుదల అవ్వబోతుంది.