Begin typing your search above and press return to search.

షాకిస్తున్న చ‌ర‌ణ్ జీబ్రా చార‌ల చొక్కా ఖ‌రీదు!

By:  Tupaki Desk   |   19 Dec 2022 4:25 AM GMT
షాకిస్తున్న చ‌ర‌ణ్ జీబ్రా చార‌ల చొక్కా ఖ‌రీదు!
X
అందాల క‌థానాయిక‌లు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేసి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగుల‌తో మురిపించ‌డం నిత్యం చూసేదే. కాస్ట్యూమ్స్ కోసం అంత‌కుమించి డ‌బ్బు ధార‌పోస్తుంటారు. ఇక ఇటీవ‌లి కాలంలో క‌థానాయిక‌ల‌ను మించి ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ లో హొయ‌లు పోయేందుకు హీరోలు కూడా రెడీ అయిపోతున్నారు. తాపీగా టైమ్ తీసుకుని మేక‌ప్ అయ్యేందుకు వెన‌కాడ‌ని హీరోల జాబితా అంత‌కంత‌కు పెరిగింది. ఇటీవ‌ల స్టార్ల ఫ్యాష‌న్ సెన్స్ అమాంతం పెరిగింది. ఇందుకు రామ్ చ‌ర‌ణ్ కూడా అతీతుడు కాదు. అత‌డు ఇప్పుడు స‌రికొత్త 'అవ‌తార్'(లుక్) తో షాక్ కి గురి చేసాడు.

ఈ ఫోటోలో అత‌డు చార‌ల డిజైన్ (జీబ్రా లుక్) తో రూపొందించిన ష‌ర్ట్ ధ‌రించి క‌నిపించాడు. బ్లాక్ అండ్ వైట్ క‌ల‌ర్ కాంబినేష‌న్ తో ఎంతో అందంగా డిజైన్ చేసిన ఈ ష‌ర్ట్ ని చూశాక దాని ఖ‌రీదును కూడా తెలుసుకోవాల‌ని అభిమానులు ఆరాట‌ప‌డుతున్నారు. అలాంటి వారి ఆనందం కోసం వివ‌రాల్ని సేక‌రిస్తే... చెర్రీ తొడుక్కున్న జీబ్రా ప్రింట్ షర్ట్ ఖ‌రీదు రూ.2ల‌క్ష‌లు అని తెలిసింది. ఖ‌రీదు సంగ‌తి అటుంచితే... రామ్ చరణ్ ఈ వెరైటీ లుక్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్నాడని కాంప్లిమెంట్లు సోష‌ల్ మీడియాల్లో పోటెత్తుతున్నాయ్.

ఈ ష‌ర్ట్ ఖ‌రీదు ఎగ్జాక్ట్ గా ఎంత ఉంటుంది? అన్న‌ది ఆరా తీస్తే... ఆన్ లైన్ స‌మాచారం మేర‌కు... రూ. 173326 (1.7ల‌క్ష‌లు) విలువైన డోల్స్ అండ్ గబ్బానా జీబ్రా ప్రింట్ షర్ట్ ఇద‌ని బ్రాండ్ గురించి తెలిసింది. ఈ ఫోటోలో చ‌ర‌ణ్‌ వైట్ డెనిమ్ జీన్స్ తో స్ప్రెడ్ కాలర్ షర్ట్ లో చాలా కూల్ గా కనిపిస్తున్నారు. చెర్రీ లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవ‌లం డిజైన‌ర్ డ్రెస్ లే కాదు.. ఖ‌రీదైన షూస్ ... జ‌ర్కిన్లు జాకెట్లతో పాటు ఖరీదైన గడియారాలను ధ‌రించే హీరోగా చ‌ర‌ణ్ కి పేరుంది. అత‌డు ఉప‌యోగించే ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ల‌పైనా మీడియాలో చాలా క‌థ‌నాలొచ్చాయి.

రామ్ చరణ్ ప్రత్యేకమైన క్లాసిక్ లగ్జరీ టైమ్ పీస్ (వాచ్‌)లను సేకరించే అల‌వాటుంద‌ని అత‌డి వ‌ద్ద ప‌దుల సంఖ్య‌లో బ్రాండెడ్ వాచ్ లు ఉన్నాయ‌నేది కూడా చాలా కొద్దిమందికే తెలుసు. ఇటీవల చెర్రీ విలాసవంతమైన వస్తువులపై తన ప్రేమ ఆస‌క్తిని రుజువు చేస్తూ ఏకంగా రూ. 2 కోట్ల ఖ‌రీదైన లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధరించి క‌నిపించాడు.

ఆర్.ఆర్.ఆర్ తో బంప‌ర్ హిట్ కొట్టిన చ‌ర‌ణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇదే స‌మ‌యంలో మ‌రో శుభ‌వార్త‌తో అభిమానుల్లో ఆనందాన్ని రెట్టింపు చేసాడు. టాలీవుడ్ జంట రామ్ చరణ్ -ఉపాసన కామినేని 2023లో తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నారు. ఇటీవ‌లే ఈ శుభ‌వార్త‌ను మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ధృవీక‌రించారు. ఈ సంతోషకరమైన వార్తను మీడియాతో అభిమానులతో షేర్ చేసుకునేందుకు మొదటగా సోషల్ మీడియాను ఆశ్ర‌యించిన‌ది మెగాస్టార్ చిరంజీవి. "శ్రీ హనుమాన్ ఆశీస్సులతో ఉపాసన - రామ్ చరణ్ తమ మొదటి బిడ్డకు వెల్ కం చెబుతున్నార‌ని చెప్ప‌డానికి మేం సంతోషిస్తున్నాము. ప్రేమ కృతజ్ఞతల‌తో సురేఖ - చిరంజీవి కొణిదెల‌.. శోభన & అనిల్ కామినేని"అంటూ ప్ర‌క‌టించారు.

డిసెంబర్ 15న ఉపాసన తన జీవితంలోని అత్యంత సంతోష‌క‌ర‌మైన వార్త‌ను అభిమానుల‌తో పంచుకోవ‌డ‌మే గాక‌.. మాతృత్వాన్ని సెల‌బ్రేట్ చేసుకునే ప్రత్యేక వేడుక నుండి ఒక ఫోటోని షేర్ చేసింది. "నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ప్రవేశిస్తున్నాను.. అని ఆనందం వ్య‌క్తం చేసారు. RC - ఉపాసన ఇద్దరూ ఈ దశలో ప్ర‌తిదీ ఆస్వాధిస్తున్నారు. ప్రస్తుతం థాయ్ లాండ్ లో సన్నిహితుల వివాహానికి ఈ జంట హాజరవుతున్నారని స‌మాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.