Begin typing your search above and press return to search.
కన్నీళ్లు పెట్టించిన ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్
By: Tupaki Desk | 8 July 2022 7:30 AM GMTఇటీవల విడుదల అయిన కన్నడ సినిమా 777 చార్లీ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విడుదల అయిన అన్ని చోట్ల కూడా ప్రశంసలు దక్కించుకుంది. రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.
కన్నడ ముఖ్యమంత్రి ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న వార్తలు సోషల్ మీడియాలో ఆ మద్య తెగ వైరల్ అయ్యాయి.
అంతే కాకుండా ఈ సినిమాను చూసిన ఎంతో మంది గుండె బరువెక్కింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మనం చూశాం.గత కొన్ని రోజులుగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
విభిన్నమైన సినిమా రూపొంది ప్రతి ఒక్కరిని కూడా అలరించిన ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. జూలై 29 వ తారీకున ఈ సినిమాను వూట్ సెలెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. కన్నడంతో పాటు పలు భాషల్లో ఈ సినిమ ను స్ట్రీమింగ్ చేయబోతున్నారట.
సౌత్ లో వూట్ సెలక్ట్ కు అంతగా ఆధరణ లేదు. దాంతో సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు. తాము ఖాతాదారులం కాని ఓటీటీ లో సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వూట్ సెలక్ట్ తో పాటు మరేదైనా ఓటీటీ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయితే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.