Begin typing your search above and press return to search.
ఛారిటీ అనేది రౌడీ మాములు కాదు - సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్
By: Tupaki Desk | 31 March 2020 9:50 AM GMTకరోనాతో ప్రపంచం గడగడలాడుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకి సెలబ్రిటీలందరూ అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తుంటే మరికొందరు స్వయంగా నిత్యవసర వస్తువులను పేదవారికి ఇచ్చి తమ ఉదాత్తతను చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లోని సెలబ్రిటీలు ఈ విషయంలో ఒకడుగు ముందే ఉన్నారు. టాలీవుడ్ హీరోలు సినిమాలలోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు.
కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ లోని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు హీరోలు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. వీళ్లతో పాటు దర్శక నిర్మాతలు కూడా ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. దీనికోసం నాగార్జున కోటి, నాగచైతన్య 25 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు ఇప్పటికే ప్రకటించారు. వీరితో పాటు టాలీవుడ్ నుండి చాల మంది ప్రముఖులు స్పందించారు. అయితే విరాళాలు ప్రకటించని స్టార్ హీరోలను నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు దేవాకట్టా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. టాలీవుడ్ ప్రముఖులందరూ విరాళాలు ప్రకటించడం మంచి విషయం. కొందరు విరాళాలు ప్రకటించినప్పటికీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేకనో, ఇంకేదైనా కారణం చేతనో వాళ్ళు బయటకి చెప్పరు. అంత మాత్రానా వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఛారిటీ అనేది సామాజిక బాధ్యతగా వసూలు చేసే రౌడీ మాములు కాదు అంటూ ట్వీట్ చేసాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.