Begin typing your search above and press return to search.

ఆయన్ను రెండు సార్లు ఖననం చేశారా?

By:  Tupaki Desk   |   17 Feb 2016 10:30 PM GMT
ఆయన్ను రెండు సార్లు ఖననం చేశారా?
X
మనిషి ఒకసారే చనిపోతాడు, ఒకసారే ఖననం చేస్తారు.. ఇది తెలిసిన విషయమే. ఇప్పుడంటే ఆ కేసులు ఈ కేసులు అని తెగ తవ్వేసి, శవాలను బయటకు తీస్తున్నారు కానీ.. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ సుప్రసిద్ధ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ ని మాత్రం రెండు సార్లు ఖననం చేయాల్సి వచ్చింది.

1977 డిసెంబర్ 25న చాప్లిన్ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని స్విట్జర్లాండ్ లోని కోర్సియర్ అనే గ్రామంలోని శ్మశానంలో ఖననం చేశారు. కానీ కొన్ని నెలల తర్వాత అనూహ్య సంఘటన జరిగింది. 1978 మార్చ్ 1న ఇద్దరు దొంగలు చాప్లీన్ శవాన్ని దొంగిలించారు. బల్గేరియా వ్యక్తి గాల్చోగనా, పోలెండ్ వ్యక్తి రోమన్ వార్డాన్ లే ఆ దొంగలిద్దరూ. ఇలా చార్లీ చాప్లీన్ భౌతిక కాయాన్ని ఖననం చేసిన ప్రాంతం నుంచి దోచుకెళ్లి.. పదహారు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రాంతంలో దాచి పెట్టారు. అప్పట్లో ఇదో పెద్ద మిస్టరీగా తయారైంది. పోలీసులకు సవాల్ విసిరినట్లైంది. ప్రజల నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి పెరిగింది.

తీవ్ర సంచలనం సృష్టించిన కేసు కావడంతో.. పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ కేసును త్వరగానే ముగించగలిగారు. చాప్లీన్ మృతదేహాన్ని కనుక్కుని, శవపరీక్షలు చేసి నిర్ధారించుకున్నారు. చివరకు మళ్లీ అదే చోట శవ ఖననం చేశారు. ఇలా ఒకే శవాన్ని ఒకసారికి మించి పాతిపెట్టాల్సి వచ్చిన అతి తక్కువ సందర్భాల్లో చార్లీ చాప్లిన్ ఉదంతం కూడా ఒకటి.