Begin typing your search above and press return to search.

ఆ హెచ్ ఐవీ నటుడు మరో బాంబు పేల్చాడు

By:  Tupaki Desk   |   21 Jun 2016 9:30 AM GMT
ఆ హెచ్ ఐవీ నటుడు మరో బాంబు పేల్చాడు
X
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్ షాకులకు అంతే లేకుండా పోతోంది. తనకు హెచ్ ఐవీ ఉందని ఆ మధ్య సంచలన ప్రకటన చేసి అందరికీ షాకిచ్చిన షీన్.. తాజాగా తాను బ్రిటన్ కు చెందిన ఓ కేబినెట్ మంత్రి కూతురుతో కూడా ఒక రాత్రి గడిపినట్లు వెల్లడించి మరో బాంబు పేల్చాడు. తాజాగా జరిగిన ఓ టీవీ షోలో భాగంగా మాట్లాడుతూ షీన్ ఈ వ్యాఖ్యలు చేసి ఆ షోకు హాజరైన జనాలందరికీ దిమ్మదిరిగేలా చేశాడు. షో ప్రెజెంటర్ అడిగిన సరదా ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు షీన్. అనంతరం మీరింకా ఎవరెవరితో శృంగారంలో అనంతరం అడిగిన ప్రశ్నలకు ఈ సమాధానం చెప్పాడు.

మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి.. బయటకు చెప్పని వాళ్లు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించగానే.. ‘‘ఉన్నారు.. అది జరిగి 20 ఏళ్లవుతోందనుకుంటా. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఆయన బ్రిటన్ కేబినెట్ మంత్రి. ఆయన కూతురితో ఒక రాత్రంతా గడిపాను’’ అన్నాడు షీన్. దీంతో షోకు హాజరైన జనాలు షాకైపోయారు. ఐతే ఆ మంత్రి ఎవరబ్బా అంటూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.

షో ప్రెజెంటర్.. ఇప్పుడు కూడా ఆ మంత్రి అధికారంలో ఉన్నాడా.. ఒకప్పుడు ఆయన ఏ శాఖ చూశాడు.. అంటూ వరుసగా ప్రశ్నలు గుప్పించాడు. దానికి బదులుగా షీన్.. తాను ఇప్పుడా పేరు చెప్పి కొత్త సమస్యలు తెచ్చుకోలేనని.. ఇంటర్ పోల్ అధికారులు తన వెంటపడతారని చెప్పి సైలెంటైపోయాడు. ఐతే ఆ మంత్రి గతంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారంటూ ఓ హింట్ ఇచ్చాడు. ఈ హింట్‌ ను బట్టి ఆ మంత్రి ఎవరో బ్రిటన్ మీడియా వాళ్లేమైనా బయటపెడతారేమో చూడాలి. హాలీవుడ్లో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న షీన్ తనకు హెచ్ ఐవీ ఉందని గత ఏడాది బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తనకు హెచ్ఐవీ ఉందని తెలిశాక కూడా కొందరు మహిళలతో శృంగారం జరిపినట్లు కూడా అతను అంగీకరించాడు.