Begin typing your search above and press return to search.

ఛార్మి ఎందుకు ఏడ్చింది?

By:  Tupaki Desk   |   27 Jan 2016 8:08 AM GMT
ఛార్మి ఎందుకు ఏడ్చింది?
X
ఐఫా అవార్డులు ముగిశాయి. ఈ ఫంక్ష‌న్ లో తార‌ల త‌ళుకుబెళుకులతో వేదికకు కొత్త క‌ళ వ‌చ్చిన ప‌రిస్థితి. ఎవ‌రికి వారు మాంచి హ్యాపీ మూడ్ తో వ‌చ్చి.. అంతే హ్యాపీగా తిరిగి వెళ్లిన‌ట్లుగా క‌నిపించింది. అయితే.. అందాల భామ ఛార్మికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. వెక్కి వెక్కి ఏడ్చిన‌ట్లుగా క‌నిపిస్తున్న ఈ ఫోటో ఇప్పుడు హ‌డావుడి చేస్తుంది. స‌రికొత్త చ‌ర్చ‌కు తెర తీస్తుంది.

కంట త‌డి పెట్టిన ఛార్మి ప‌క్క‌నే.. ఉన్న మ‌రో అందాల బొమ్మ శ్రియ శ‌ర‌న్ ప్చ్ అన్న‌ట్లుగా ఎక్స్ ప్రెష‌న్ పెట్ట‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంద‌రూ కులాసాగా క‌బుర్లు చెప్పుకుంటున్న వేళ‌.. ఈ ముద్దుగుమ్మ‌ల మూడ్ ఆఫ్ కు కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఇద్ద‌రు భామ‌లు.. ఇప్పుడు మాంచి అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న ప‌రిస్థితి. ఈ ఇద్ద‌రికి అవ‌కాశాలు అప్పుడ‌ప్ప‌డు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. అవ‌కాశం ద‌క్కిన‌ప్ర‌తిసారీ త‌మ స‌త్తా చాటుతున్నారు.

ఇదిలా ఉంటే.. అవార్డుల కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వీరిద్ద‌రి మూడ్ ఆఫ్ కు కార‌ణం ఏమిటి? ఛార్మి అంత‌లా క‌న్నీటితో ఉండ‌టానికి దారి తీసిన ప‌రిస్థితులు ఏమిట‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.