Begin typing your search above and press return to search.
'లైగర్' ఇంటర్వ్యూలో ఏడ్చేసిన చార్మీ
By: Tupaki Desk | 20 Aug 2022 10:00 AM GMTవిజయదేవరకొండ హీరోగా ప్రేక్షకులను పలకరించడానికి 'లైగర్' రెడీ అవుతోంది. అనన్య పాండే కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతున్న ఈ సినిమాను, ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పూరి .. కరణ్ జొహార్ తో పాటు చార్మీ కూడా ఈ సినిమాకి ఒక నిర్మాతగా వ్యవహరించారు. గ్లామరస్ హీరోయిన్ గా కొంతకాలం పాటు చక్రం తిప్పేసిన చార్మీ, నాయిక ప్రధానమైన పాత్రలలోను మెప్పించారు. హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ, ఆమె పూరి ప్రొడక్షన్ లో భాగమయ్యారు.
కష్టాలే అయినా .. నష్టాలే ఎదురైనా ఆమె చాలా కాలంగా పూరి ప్రొడక్షన్ లో భాగమవుతూ ముందుకు వెళుతున్నారు. 'లైగర్' ప్రమోషన్స్ కి సంబంధించిన ఇంటర్వ్యూలో చార్మీ మాట్లాడుతూ .. "2019లో నేను .. పూరిగారు కలిసి వెళ్లి విజయ్ దేవరకొండకి కథ చెప్పడం జరిగింది.
కథ వినగానే ఆయన 'మెంటలెక్కేసింది .. దింపుదాం' అన్నాడు. అలా అక్కడి నుంచి ఆ సినిమా అడుగు ముందుకు పడింది. 2020 జనవరిలో ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేశాము. 45 రోజుల పాటు షూటింగ్ చేసిన తరువాత మార్చిలో 'ఫస్టు లాక్ డౌన్ పడింది.
లాక్ డౌన్ సమయంలో విజయ్ దేవర కొండ కాల్ చేసి .. ఇంకా ఎప్పుడు షూటింగుకి తీసుకుని వెళతారు అని అరిచాడు. రెండేళ్ల పాటు ఆయన జిమ్ బాడీ మెయింటెయిన్ చేయడం నిజంగా చాలా కష్టమైన విషయం.
కోవిడ్ కారణంగా ఆర్ధికకపరమైన ఇబ్బందులు వచ్చేశాయి. ఈ సమయంలోనే ఈ సినిమాను గురించి కొంతమంది నెగెటివ్ గా ప్రచారం చేశారు. అస్సలు డబ్బులు లేని ఆ సమయంలో ఆ టెన్షన్స్ తట్టుకోలేక నాకు ఏడుపు వచ్చేది. మా దగ్గర డబ్బులు లేని ఆ సమయంలో ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చింది.
అంత భారీ ఆఫర్ ను రిజెక్ట్ చేయడానికి దమ్ము కావాలి .. ఆ దమ్ము పూరి గారిలో ఉంది" అంటూ చార్మీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ తరువాత దుఃఖాన్ని దిగమింగుకుంటూ మళ్లీ మొదలుపెట్టారు. " జనాలు ఈ సినిమాను థియేటర్లోనే చూడాలి అంటూ ఓటీటీ ఆఫర్ ను పూరి గారు రిజెక్ట్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసిన తరువాత ఫిఫ్టీ పెర్సెంట్ ఆక్యుపెన్సీ అన్నారు. రిలీజ్ చేద్దామని చూసినా థియేటర్స్ దొరకని పరిస్థితి. చివరికి ఈ సినిమా ఈ నెల 25న రాబోతోంది. ఈ మొత్తం జర్నీలో మాకు అండగా నిలబడింది విజయ్ దేవరకొండ ... ఈ సినిమా కంటెంట్ మాత్రమే" అంటూ చెప్పుకొచ్చారు.