Begin typing your search above and press return to search.

విచార‌ణ పూర్తి...చార్మి ప‌ట్టు నెగ్గింది

By:  Tupaki Desk   |   26 July 2017 12:55 PM GMT
విచార‌ణ పూర్తి...చార్మి ప‌ట్టు నెగ్గింది
X
గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న సినీ సెలబ్రిటీలను విచారిస్తున్న క్ర‌మంలో ఈరోజు చార్మి విచార‌ణ ముగిసింది. డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న చార్మీ ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు విచార‌ణకు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. చార్మిని తప్ప అమెతో వ‌చ్చినవారెవ‌రినీ అధికారులు లోపలికి అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాల ప్ర‌కారం సాయంత్రం 5 గంట‌ల లోపు చార్మి విచార‌ణ ముగించారు. సిట్ కార్యాలయంలో చార్మిని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత, సీఐలు విజలక్మీ, శ్రీలత, రేణుక విచార‌ణ చేప‌ట్టారు.

హైకోర్టు ఆదేశాల మేరకే వారు చార్మిని ప్రశ్నించారు. కెల్విన్ మొబైల్ లో ఆమె పేరు చార్మి దాదా పేరుతో ఉండడం, ఇద్దరి మధ్య వాట్సాప్ లో వెయ్యికి పైగా కన్వర్జేషన్ , జ్యోతి లక్ష్మీ ఫంక్షన్ లో కెల్విన్ తో సెల్ఫీలు దిగడం వంటి అంశాలపై సిట్ మహిళా అధికారుల బృందం చార్మిని ప్రశ్నించిన‌ట్లు తెలుస్తుంది. కోర్టు ఆదేశాల ప్ర‌కారం చార్మి రక్త న‌మూనాలు సేక‌రించ‌ని అధికారులు, మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉంటుంద‌ని ఆమెకు తెలిపారు. చార్మి విచార‌ణ స‌మ‌యంలో వెల్ల‌డించిన అంశాల‌ను అధికారులు స్టేట్‌మెంట్‌గా రికార్డు చేశారు. ఈ విచార‌ణ ఆరున్న‌ర గంట‌ల పాటు సాగింది. రేపు న‌టి ముమైత్ ఖాన్‌ను ఉద‌యం 10 గంట‌ల‌కు సీట్ అధికారులు విచారించ‌నున్నారు.

మ‌రోవైపు బుధవారం ఉదయం 10 గంటలకే చార్మి పలువురు బౌనర్స్, తన లాయర్ తో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకుంది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ ప్రాంగణం చార్మి రాకతో హడావిడిగా మారింది. అయితే చార్మిని తప్ప మరెవరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. అయితే చార్మి ఈ రోజు ఉదయం కొండాపూర్ లో పైసా వసూల్ షూటింగ్ లో పాల్గొని అక్కడి నుండి డైరెక్ట్ గా సిట్ ఆఫీసుకి హాజరైనట్టు తెలుస్తుంది. ఆసుపత్రిలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలలో చార్మి పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు చార్మి పైసా వసూల్ చిత్రానికి ప్రొడక్షన్ బాధ్యతలు కూడా చూస్తుంది.