Begin typing your search above and press return to search.
'లైగర్' పై ఛార్మీ కౌర్ స్పందన..!
By: Tupaki Desk | 30 Aug 2022 5:08 AM GMTవిజయ్ దేవరకొండ - అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''లైగర్''. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి - ఛార్మీ కౌర్ ఈ సినిమాని నిర్మించారు. ఎన్నో అంచనాలతో గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.
'లైగర్' సినిమాపై దర్శక హీరోలతో పాటుగా నిర్మాత ఛార్మి కూడా భారీ ఆశలే పెట్టుకుంది. టాలీవుడ్ ఏక్తా కపూర్ అనే రేంజ్ లో సినిమాని ప్రమోట్ చేసింది. ఇంతకుముందెన్నడూ ఇలాంటి సినిమా రాలేదనే విధంగా స్టేట్మెంట్స్ ఇచ్చింది. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని.. అందుకే ఓటిటీ ఆఫర్ వచ్చినా తిరస్కరించినట్లు తెలిపింది.
పాండమిక్ టైం లో ఎన్నో వ్యయప్రయాసలు పడి సినిమాని పూర్తి చేసినట్లు చార్మీ కౌర్ ఓ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అయితే 'లైగర్' రిలీజ్ తర్వాత మేకర్స్ కు ఆ కన్నీళ్లే మిగిలాయి. తొలి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాలీవుడ్ - టాలీవుడ్ మొత్తం షాక్ అయ్యేలా పేలవమైన వసూళ్ళు రాబట్టింది. ఈ నేపథ్యంలో లైగర్ ప్లాప్ పై చార్మీ స్పందించింది.
చార్మీ లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'లైగర్' ఫెయిల్యూర్ నిరుత్సాహ పరిచింది. జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్ తో మెరుగైన కంటెంట్ ను చూడడానికే ఇష్టపడుతున్నారు. కుటుంబం మొత్తం టీవీల్లో బిగ్ బడ్జెట్ చిత్రాలను చూడవచ్చు. థియేటర్లో చూడాలి అనే ఎగ్జైట్ చేసే సినిమాలకు తప్ప ప్రేక్షకులు మిగతా వాటి కోసం థియేటర్లకు రావడం లేదు అని తెలిపింది.
"కానీ టాలీవుడ్ లో అలా కాదు. ఆగస్ట్ లో బింబిసార - సీతా రామం మరియు కార్తికేయ 2 వంటి మూడు తెలుగు సినిమాలు అద్భుతంగా ఆడాయి. సుమారు రూ. 150–170 కోట్లు వరకు కలెక్షన్స్ అందుకున్నాయి. అలాగని సౌత్ లో సినిమా పిచ్చోళ్లు ఎక్కువని అసలేం. కాకపోతే ఇక్కడ ఉన్నట్లు బాలీవుడ్ లో లేదు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది" అని ఛార్మి అభిప్రాయ పడింది.
"ఒకటి కాదు రెండు కాదు 'లైగర్' సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. మేము 2019లో కరణ్ జోహార్ ని కలిశాము. జనవరి 2020లో మొదటి షెడ్యూల్ ని ప్రారంభించగా.. సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వాటన్నింటిని దాటుకొని రిలీజ్ చేశాం. థియేట్రికల్ రిలీజ్ చేయాలనే నమ్మకంతోనే మూడేళ్ళపాటు వేచి చూశాం. కానీ మా ప్రయత్నం ఆడియన్స్ కు నచ్చలేదు. లైగర్ ప్లాప్ అవ్వడం నన్ను చాలా బాధకు గురిచేసింది" అని ఛార్మీ కౌర్ ఎమోషనల్ అయ్యింది.
'లైగర్' ప్లాప్ పై ఛార్మీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పూరీ కనెక్ట్స్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషలలో విడుదల చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.