Begin typing your search above and press return to search.
టచ్ చేసిన వ్యక్తిపై ఛార్మీ నో కంప్లైంట్
By: Tupaki Desk | 27 July 2017 4:56 PM GMTడ్రగ్స్ విచారణలో భాగంగా హాజరైన ప్రముఖ నటి ఛార్మీ బుధవారం అబార్కీ కార్యాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం.. తోపులాట జరగటం తెలిసిందే. ఛార్మి వచ్చిన సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించటం విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. విధులు నిర్వర్తిస్తున్న కొందరు పోలీసులు అయితే తమ పని వదిలేసి.. సెల్ఫీలు తీసుకోవటం కనిపించింది.
ఛార్మి కోసం మహిళా బందోబస్తు ఏర్పాటు చేసినా.. ఒక పురుష కానిస్టేబుల్ ఛార్మీని టచ్ చేయటం..ఈ సందర్భంగా ఆమె ఇబ్బందికి గురి కావటం తెలిసిందే. ఈ వ్యవహారం విజువల్స్ సాక్షిగా పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి. సదరు కానిస్టేబుల్‌ను గుర్తించారు కూడా.
ఇదిలా ఉంటే..ఛార్మిని టచ్ చేసిన కానిస్టేబుల్ తీరు వివాదాస్పదం కావటంతో ఈ వ్యవహారంపై ఉన్నత అధికారులు విచారణకుఆదేశించారు. ఈ సందర్భంగా సదరు కానిస్టేబుల్ మీద ఛార్మి ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ విషయం మీద అధికారులు తాజాగా స్పష్టత ఇచ్చారు. తనను అనుచితంగా టచ్ చేశారని ఛార్మి ఎవరి మీదా ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. ఒకవేళ ఛార్మి ఇవ్వకున్ఆన.. అలా తప్పుగా ప్రవర్తించిన పోలీసు మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.