Begin typing your search above and press return to search.
శాంపిల్స్‌కు నో చెప్పేసిన ఛార్మి
By: Tupaki Desk | 27 July 2017 4:32 AM GMTడ్రగ్స్ విచారణకు హాజరైన ప్రముఖ సినీ నటి ఛార్మి ఆరున్నర గంటలకు పైనే సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మరి.. ఇంత సమయంలో ఛార్మిపై అధికారులు సంధించిన పలు ప్రశ్నలు.. ఆమె విచారణను ఎదుర్కొంటున్న సమయంలోనే బయటకు రావటం తెలిసిందే.
అయితే.. అధికారులు వేసిన పలు ప్రశ్నలకు బదులుగా ఛార్మి ఎలా రియాక్ట్ అయ్యారు? అన్న అంశం మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ను విచారించిన సమయంలో ఛార్మి గురించి అతడు వెల్లడించిన వివరాలు అధికారుల్ని నివ్వెరపోయేలా చేశాయని చెబుతారు.
ఛార్మి గురించి కెల్విన్ చెప్పిన సమాచారం ఆధారంగా ఆమెను ఎక్కువ ప్రశ్నలు వేసినట్లుగా తెలుస్తోంది. సూటి ప్రశ్నలను సిట్ అధికారులు చాలా తక్కువగా సంధించినట్లుగా సమాచారం. తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకునేందుకు.. గతంలో ఇదే తరహాలో విచారించిన పలువురు సినీ ప్రముఖులు ఇచ్చిన సమాధానాల్ని క్రాస్ చెక్ చేసుకునేందుకు ఛార్మి విచారణను అధికారులు వాడుకున్నట్లుగా చెబుతున్నారు.
ఛార్మికి సంధించిన ప్రశ్నల్లో చాలావరకూ పరోక్ష ప్రశ్నలే ఉన్నాయని తెలుస్తోంది. తమకు అవసరమైన సమాధానాల్ని ఛార్మి నుంచి అధికారులు రాబట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
చాలా ప్రశ్నలకు తనకు సమాధానాలు తెలీవని తెలివిగా ఛార్మి చెప్పినప్పటికీ.. ఆమెకు తెలీకుండా ఆమె ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చేసిందన్న మాట వినిపిస్తోంది. డ్రగ్స్ విచారణలో నోటీసులు అందుకున్న పలువురు సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ ఛార్మి రోల్ చాలా భిన్నమన్న మాట వినిపిస్తోంది. ఈ కేసులో ఛార్మి చాలా ప్రత్యేకమని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించినట్లుగా చెబుతున్నారు.
ఈవెంట్ నిర్వాహకుల ద్వారా కెల్విన్ పరిచయమైనట్లుగా తెలుస్తోంది. మత్తు మందుల గురించి ప్రశ్నించినప్పుడు తనకు ఏమీ తెలీదని ఛార్మి చెప్పిందంటున్నారు. ఇదిలా ఉంటే.. తన బ్లడ్ శాంపిల్స్.. గోళ్లు లాంటి వాటిని ఇచ్చేందుకు ఛార్మి నో చెప్పేశారు. ఈ విషయాన్ని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించే కేస్ డైరీలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.