Begin typing your search above and press return to search.
తన ఒక్కడికే తెలుసన్న ఛార్మీ
By: Tupaki Desk | 19 Jan 2018 8:00 AM GMTమొన్నటి దాకా అగ్ర హీరోల సరసన హీరొయిన్ గా చేసిన ఛార్మీ ప్రస్తుతం రూటు మార్చి పూరి కనెక్ట్స్ సంస్థలో ప్రొడక్షన్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన పూరి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం హగ్ కి నిర్మాత ఛార్మీ కౌరే. ప్రస్తుతం పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నిర్మాణమవుతున్న మెహబూబా షూటింగ్ లో ఉన్న ఛార్మీ తన అన్నయ్య మిక్కికి స్పెషల్ గా ఇంకా చెప్పాలంటే కాస్త వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలిసీతెలియని పసి వయసులో చిన్నప్పుడు తీసుకున్న ఫోటోను, దానితో పాటు లేటెస్ట్ గా అన్న మిక్కితో తీసుకున్న సెల్ఫీని పక్కపక్కన పోస్ట్ చేసిన ఛార్మీ వాటి కంటే ఎక్కువ తన మెసేజ్ తో ఆకట్టుకుంది. అందరిలా విష్ చేస్తే తన ప్రత్యేకత ఏముంటుంది.
తన హిస్టరీ, జ్యాగ్రఫి, కెమిస్ట్రీ అన్ని తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి మిక్కికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ మికిమక్స్ అని పేరు మీద ఉన్న అతని ట్విట్టర్ ఎకౌంటు కి ట్యాగ్ చేసింది ఛార్మీ. నిజానికి ఇందులో చాలా అర్థం ఉంది. ఒక చెల్లెలి గురించి ఈ ప్రపంచంలో అన్నయ్య కంటే ఎక్కువగా ఇంకెవరికి తెలిసి ఉంటుంది అనే మీనింగ్ వచ్చేలా పోస్ట్ చేసి ఇద్దరికీ ఎంత చక్కని అనుబంధం ఉందో మెసేజ్ లోనే చూపించింది ఛార్మీ. చిన్నప్పటి ఫోటోలలో మాత్రం ఛార్మీ, ఇద్దరు భలే ముద్దుగా ఉన్నారు. ఏదో నోట్లో పెట్టుకోబోతూ ఛార్మీ కెమెరా వంక చూస్తుండగా మరోపక్క మిక్కి తింటున్న చపాతీకి బ్రేక్ ఇచ్చి కెమెరా వంక నవ్వుతూ ఫోజిచ్చాడు. ఎంతైనా ఇలాంటి జ్ఞాపకాలు షేర్ చేసుకున్నప్పుడు కలిగే ఆనందం వేరు. అందుకే ఛార్మీ కూడా తన సోషల్ మీడియాలో ఇలా క్రియేటివ్ గా వాడుకుంది.