Begin typing your search above and press return to search.

ఏ టైంలో పుట్టావమ్మా సమంత నువ్వు : ఛార్మి

By:  Tupaki Desk   |   6 July 2019 5:52 AM GMT
ఏ టైంలో పుట్టావమ్మా సమంత నువ్వు : ఛార్మి
X
సమంత హీరోయిన్‌ గా నటించిన 'ఓ బేబీ' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రివ్యూవర్స్‌ నుండే కాకుండా ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై పాజిటివ్‌ గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత నటనకు మంచి మార్పులు పడుతున్నాయి. ప్రతి రివ్యూలో కూడా సమంత నటన ప్లస్‌ అంటూ పేర్కొనడం జరిగింది. సినీ ప్రముఖులు పలువురు సైతం 'ఓబేబీ'లోని సమంత నటన సూపర్బ్‌ అంటూ ప్రశంసలు కురిపించారు.

తాజాగా సమంత 'ఓ బేబీ' పై తోటి హీరోయిన్‌ అయన ఛార్మి స్పందించింది. ఆమె చేసిన ట్వీట్‌ ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు అందరి దృష్టిని ఆకర్షించింది. ఛార్మి ట్విట్టర్‌ లో... ' ఏ టైమ్‌ లో పుట్టావమ్మా నువ్వు? నీ హార్డ్‌ వర్క్‌ కు.. నీ డెడికేషన్‌ కు.. నీ జాతకానికి నమస్కారం సమంత అంటూ ట్వీట్‌ చేసింది. సమంతను ఆకాశానికి ఎత్తిన ఛార్మి ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.

సమంత 'ఓ బేబీ' చిత్రం కోసం ఎంతగా కష్టపడిందో సినిమా చూస్తుంటే అర్థం అవుతుంది. ఒక పడుచమ్మాయి ముసలమ్మ మాదిరిగా ప్రవర్తించడం అంటే మామూలు విషయం కాదు. చాలా సహజంగా సమంత నటించి వావ్‌ అనిపించుకుంది. సమంత ఇన్నాళ్లు చేసిన సినిమాల్లోని పాత్రలు ఒక ఎత్తయితే ఈ చిత్రంలోని బేబీ పాత్ర మరో ఎత్తు అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.