Begin typing your search above and press return to search.
మగ పనులు చేయాలంటే ఛార్మికి సరదా
By: Tupaki Desk | 24 May 2015 5:30 PM GMTమొత్తానికి కెరియర్‌లో ఎన్నడూ లేనంత ఎక్సయిటింగ్ ఉంది హీరోయిన్ ఛార్మి. ఒకప్పుడు ఏదైనా సినిమాను స్టార్ట్ చేయాలంటే.. డిస్కషన్స్‌కు ఓ నెల.. షూటింగ్ మూడు నెలలు.. ప్రచారం రెండు నెలలు.. ఒక నెల వాయిదాలు.. చివరాకరకు సినిమా రిలీజ్ అన్నట్లు ఉండేది. కాని వారం రోజుల్లో కథ-మాటలు రాసుకొని, నెల రోజుల్లో సినిమా పూర్తయిపోతే ఆ కిక్ ఎలా ఉంటుంది?
జ్యోతిలక్ష్మి సినిమా చేయడంతో ఛార్మి అలాంటి కిక్‌నే ఎంజాయ్ చేస్తోంది. ఎంతో స్పీడ్‌గా పనిచేసే పూరి జగన్‌తో ఇలా ఫాస్ట్‌గా కేవలం నెల రోజుల్లో ఓ సినిమాలోని పాటలూ, యాక్షన్ సీన్లు, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్, ఛేజ్‌లు వగైరా అన్నీ పూర్తి చేసేయడంతో ఈమెకు చాలా ఆనందాన్నిస్తోంది. అయితే ఇంత స్పీడ్‌గా చేయాలంటే ఛార్మి ఎంతో కోపరేట్ చేసుండాలి. పైగా ఆ బైక్ నడిపే సీన్లు.. వామ్మో.. అసలు ఛార్మి ఎంత కష్టపడి ఉంటుందో..
''చిన్నప్పుడు మా అన్నయ్య బండి కొనిచ్చారు. ఎవ్వరూ లేనప్పుడు తాళాలు దొబ్బేసి ఆ బైక్‌ను నేను వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. దానితో బైక్ డ్రైవింగ్ వచ్చేసింది. ఇప్పుడికి పూరి జగన్ కోసం చీరకట్టుకొని మరీ ఎన్‌ఫీల్డ్ నడిపా. ఓ రెండుసార్లు ట్రైయల్ వేయగానే వచ్చేసింది. చిన్నప్పటి నుండి ఇలాంటి మగ పనులు చేయడం వలన అదంతా ఈజీ అయ్యిందిలే'' అని చెప్పుకొచ్చింది ఛార్మి. అమ్మడికి చాలా సరదాలే ఉన్నాయే.