Begin typing your search above and press return to search.

జుట్టుతో ప్రయోగాలు చేస్తున్న ఛార్మి!!

By:  Tupaki Desk   |   18 Sep 2016 9:30 AM GMT
జుట్టుతో ప్రయోగాలు చేస్తున్న ఛార్మి!!
X
పంజాబీ భామ ఛార్మీ కౌర్ ఈ మధ్య తన సినిమాల విషయంలో బాగా సైలెంట్ అయిపోయింద. జ్యోతిలక్ష్మి తర్వాత కొంత గ్యాప్ తీసుకుని కోలుకున్న ఛార్మీ.. అంతగా వార్తల్లో వినిపించడం లేదు. పూరీ కనెక్ట్స్ అమ్మాయిలను పరిచయం చేయడం.. పార్టీలు చేసుకోవడం లాంటివి తప్ప.. ఈ భామ స్పెషల్ గా వార్తల్లోకి వచ్చిన సందర్భాలు ఏవీ లేదు.

ఈ మధ్య కాలంలో ఛార్మీ తన హెయిర్ ని కట్ చేయించేసుకున్న సంగతి తెలిసిందే. అలా షార్ట్ హెయిర్ తో కనిపిస్తున్న ఛార్మీ..ప్రస్తుతం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నట్లు చెబుతోంది. అది కూడా ఆ పొట్టి జుట్టుతోనే అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. మన దగ్గర అమ్మాయిలు ఎక్కువగా లాంగ్ హెయిర్ తోనే ఉండడంతో.. అండర్ కట్ అనే స్టైలింగ్ కు పెద్దగా ప్రచారం లేదు. ఆ స్టైల్ ని ఇప్పుడు చూపించబోతోంది ఛార్మీ. 'ఇప్పుడు పొట్టిగా ఉన్న జుట్టుతోనే ప్రయోగాలు చేస్తున్నా. అందులో భాగమే లేటెస్ట్ ట్రెండ్ అయిన అండర్ కట్. జుట్టు పెరిగితే అప్పుడు ఈ ఎక్స్ పెరిమెంట్ కి స్కోప్ ఉండదు కదా' అంటోంది ఛార్మీ.

మరి కొత్తగా ఏమైనా చేస్తున్నావా ఛార్మీ అంటే.. సినిమాల గురించి మానేసి.. ఇది కొత్తగా ట్రై చేస్తున్నదే కదా అంటూ మాట మార్చేస్తోంది. మనసుకు ఏది అనిపిస్తే అది చేసేయడమే ఇప్పుడు ఇప్పుడు తన కొత్త స్టైల్ అని చెబుతోంది భామ.