Begin typing your search above and press return to search.

బాగా ఆశలు పెట్టేసుకుంటే ఇత్తడే

By:  Tupaki Desk   |   10 Jun 2015 6:08 AM GMT
బాగా ఆశలు పెట్టేసుకుంటే ఇత్తడే
X
అసలు ఒక సినిమా హిట్టవుతుందని ఫ్యాక్టర్స్‌ చెప్పమంటే ఏమీ చెప్పలేం. ఏ సినిమా ఎందుకు హిట్టవుతుందో కూడా తెలియని పరిస్థితి. క్రిటిక్స్‌కు నచ్చితే ఆడియన్స్‌కు నచ్చదు, ఆడియన్స్‌ చూస్తోంది క్రిటిక్స్‌కు నచ్చదు, ఓవరాల్‌గా కంటెంట్‌ లేని సినిమాలు కొందరు కోట్లు కొల్లగొడుతుంటే, భారీగా కంటెంట్‌ను జొప్పించి కూడా కొందరు హిట్టనేదే కొట్టలేకపోతున్నారు. అందుకే హీరోయిన్‌ ఛార్మిని కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేది.

ఒకవేళ జ్యోతిలక్ష్మి సినిమా హిట్టయితే? అని మన నోట్లోంచి ప్రశ్న వచ్చేలోపే.. అబ్బే అది హిట్టే.. సూపర్‌ హిట్‌.. ఈ సినిమా తరువాత నాకు పేరు, డబ్బూ రెండూ వచ్చేస్తాయి అంటూ అమ్మడు ఫిక్సయిపోయింది. ఈ రేంజులో ఆశలు పెట్టుకుంటే కరక్టేనా? చాలామంది హీరోలు కొన్ని పెద్ద పెద్ద సినిమాలు హిట్టవుతాయని ఆశించి, అవి ఫ్లాపయ్యాక చాలా భంగపడ్డారు. మానసికంగా కుంగిపోయారు. పవన్‌ కళ్యాణ్‌ వంటి హీరో కూడా జానీ ఫెయిలైనందుకు చాలా ఏళ్ళు బాధపడ్డాడు. ఆ లెక్కన చూస్తుంటే ఇప్పుడు ఛార్మి కూడా ఓవర్‌గా ఆశలు పెట్టుకుంటే.. రేపొద్దున్న రిజల్ట్‌ ఏమన్నా తేడా పడిందంటే.. ఇత్తడే మరి. ప్రేక్షకుల చేతుల్లో ఉంది అని అనుకో ఛార్మి.. నువ్వే హిట్టంటూ కలగనకూ..