Begin typing your search above and press return to search.
పిల్లలకు జ్యోతిలక్ష్మి అన్న పేరెట్టుకుంటారు'
By: Tupaki Desk | 10 Jun 2015 10:30 PM GMTఛార్మింగ్ బ్యూటీ ఛార్మి కథానాయికగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన 'జ్యోతిలక్ష్మి' ఈ శుక్రవారం (12న) రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఛార్మి ముచ్చటించిన ఆసక్తికర సంగతులివి...
=నేను నిర్మాత అవ్వడం యాధృచ్ఛికం. పూరి, కల్యాణ్‌గారు నన్ను నమ్మి ఆ అవకాశం ఇచ్చారు. ప్రొడక్షన్ విషయంలో నీక్కావాల్సిన స్వేచ్ఛ తీసుకో. నిర్ణయాలన్నీ నీకే వదిలేస్తాం అని అన్నారు. అనుకోకుండానే నిర్మాతనయ్యా. అయితే హీరోయిన్‌గా నటించినప్పటికంటే నిర్మాతగా పనిచేయడమే పెద్ద కిక్కిచ్చింది. ప్రీప్రొడక్షన్ నుంచి ప్రతి విషయం తెలుసుకోగలిగాను.
=ఆరేళ్ల క్రితమే పూరి నాకు ఈ కథ చెప్పారు. తను బిజీగా ఉండడం వల్ల సెట్స్‌కి వెళ్లడం కుదరలేదు. ఇంతకాలానికి కుదిరింది. మధ్యలోనే మా కలయికలో బుడ్డా హోగా తేరా బాప్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
=పిల్లలకు ఇంతకాలం జ్యోతిలక్ష్మి అన్న పేరు పెట్టుకోవడానికి తల్లిదండ్రులు భయపడేవారు. కానీ ఈ సినిమా చూశాక ఆ భయమే ఉండదు. అంతేకాదు అదే పేరు తమ పిల్లలకి పెట్టుకుంటారు. అంత మంచి పాత్ర ఇది..
=ఇందులో వేశ్యగా నటించాను. వేశ్య కథా అని అంతా శృంగారమే కాదు. వల్గారిటీ అసలే ఉండదు. నాటీగా, హ్యాపీగా, ఫన్నీగా ఉండే అమ్మాయి కథ ఇది.
=ఇదో అసాధారణమైన ప్రేమకథ. హీరో జ్యోతిలక్ష్మిని ప్రేమిస్తాడు. ప్రథమార్థమంతా అతడితో రొమాన్స్ సాగిస్తుంది. ద్వితీయార్థంలో అనుకోని ట్విస్టు. అక్కడినుంచి జ్యోతిలక్ష్మి ఎలాంటి టర్న్ తీసుకుందో ఆసక్తికరం. ద్వితీయార్థంలో పెళ్లయిన యువతిగా కనిపిస్తాను.
= 37రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు పూరి. ఒక సినిమా ఆన్‌సెట్స్ ఉండగానే తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తారు స్పీడ్ డైరెక్టర్. అందుకే అతడు తెలివైన దర్శకుడు.
=జ్యోతిలక్ష్మి సెట్స్‌లో ఉండగానే పూరికి మరో ఆలోచన వచ్చింది. ఆ పాయింట్ బావుందనిపించి డెవలప్ చేశారు. జ్యోతిలక్ష్మి సీక్వెల్‌కి రెడీ అన్నారు. నిర్మాత సి.కల్యాణ్ కూడా సై అనడంతో ఇక రెండో భాగానికి కూడా రెడీ అయిపోతున్నాం. అయితే తొలి భాగం విజయంపైనే ఇదంతా ఆధారపడి ఉంది.
=బైక్ రైడింగ్ అంటే పిచ్చి ఇష్టం. చిన్నప్పుడు బైక్ తాళాలు దొంగిలించి పెరటి వెనకనుంచి వెళ్లి డ్రైవ్ చేసేదాన్ని. జ్యోతిలక్ష్మిలో బైక్‌పై సీన్ సింగిల్ టేక్‌లో చేసేశా. బైక్ ఈజీగా నడిపించేశా. షూటింగ్ అయ్యాక కూడా దానిపై శికార్లు చేసేదాన్ని. బైకంటే అంత ఇష్టం.