Begin typing your search above and press return to search.
పూరి తప్పు చేయమన్నాడట
By: Tupaki Desk | 10 Jun 2015 6:16 AM GMTరామ్‌గోపాల్ వర్మ కాంపౌండ్ సూక్తులు ఛార్మికి బాగా ఒంటబట్టాయి. వర్మ తన శిష్యులకు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాడు. 'తప్పులు చేయండి, అప్పుడే మీకు ఎక్కువ విషయాలు తెలుస్తాయ'ని బోధిస్తుంటాడు. ఆయన మాటల్ని తు.చ పాటిస్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటుంది ఆయన శిష్యగణం. ఛార్మి కూడా ఆ కాంపౌండ్‌లోకి ఎప్పుడో చేరిపోయింది కాబట్టి ఆమె కూడా తప్పులు చేయడం అలవాటు చేసుకొందట. వర్మతో పాటు పూరి కూడా తనకు తప్పు చేయమనే చెబుతుంటాడని ఛార్మి చెప్పుకొచ్చింది.
'జ్యోతిలక్ష్మి' ప్రమోషన్‌లో భాగంగా ఛార్మి నిన్న విలేకరుతో సమావేశమైంది. అందులో ఆమె బోల్డ్‌గా బోలెడన్ని విషయాలు చెప్పుకొచ్చింది. అచ్చం వర్మలాగే పెళ్లంటే నాకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది ఛార్మి. నన్ను భరించేవాడు ఎవడుంటాడు అని ప్రశ్నించింది. కెరీర్ గురించి మాట్లాడుతూ ''జయాపజయాలు రెండింటినీ చవిచూశాను. మధ్యలో కొన్ని తప్పులు చేశాను. అలాగని ఇప్పుడు తప్పులు చేయనని కాదు. ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటా. అప్పుడే కొత్త విషయాలు తెలుస్తాయి. పూరి అదే విషయాన్ని నాకు చెబుతుంటాడు'' అని సెలవిచ్చింది ఛార్మి.