Begin typing your search above and press return to search.

జిమ్ లో సామీ సామీ అంటూ రెచ్చ‌గొట్టిన ఛార్మి

By:  Tupaki Desk   |   26 Dec 2021 1:30 AM GMT
జిమ్ లో సామీ సామీ అంటూ రెచ్చ‌గొట్టిన ఛార్మి
X
`పుష్ప‌- ది రైజ్` చిత్రం నుంచి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ `సామీ సామీ..` ఎంత‌గా స‌క్సెసైందో తెలిసిందే. ఈ పాట‌కు వెబ్ లో యాప్ లలో బోలెడ‌న్ని అనుక‌ర‌ణ‌లు హోరెత్తాయి. ఔత్సాహిక ఆర్టిస్టులంతా సామీ సామీ సాంగ్ కి స్టెప్పులేస్తూ అల‌రిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న హుక్ స్టెప్ కి బోలెడంత ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

ఇప్పుడు ఈ పాట‌కు జిమ్ లో ఛార్మి వేసిన స్టెప్ అంతే వైర‌ల్ గా మారుతోంది. అలా వెయిట్ ని చెక్ చేసుకుంటూ ఛార్మి స‌ర‌దాగా సామీ సామీ స్టెప్ ని వేస్తోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో యూత్ వాట్సాపుల్లో షేర్ అవుతోంది. జిమ్ లో ఛార్మి బోలెడంత ఫ‌న్ క్రియేట్ చేస్తున్నారు. సామీ సామీ పాట పాడుతూ ఛార్మి జాలీగా ఉన్నారు మ‌రి.

మ్యాడ‌మ్ మీరు మ‌రీ అదుపు త‌ప్పి వెయిట్ పెరుగుతున్నారు. ఇలా అయితే క‌ష్టం! కాస్త ఫిట్నెస్ పై శ్ర‌ద్ధ పెడితే బావుంటుంది. మ‌రీ బొద్దుత‌నం బ‌య‌ట‌ప‌డుతోంది. స్లిమ్ అయ్యేందుకు ఛాన్సున్నా ఎందుక‌ని ప్ర‌య‌త్నించ‌రు? అంటూ ఛార్మిని ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో పూరి క‌నెక్ట్స్ లో పూరీతో స‌హ నిర్మాత‌గా మారి సినిమాలు నిర్మిస్తున్నారు ఛార్మి. న‌ట‌న నుంచి ఆల్మోస్ట్ విర‌మించిన‌ట్టే క‌నిపిస్తోంది. పూరి-ఛార్మి-క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న లైగ‌ర్ పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుంది. తెలుగు స‌హా ద‌క్షిణాది భాష‌ల్లో.. హిందీలో అత్యంత భారీగా విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌- అన‌న్య పాండే జంట‌గా న‌టిస్తున్నారు. 2022 ఆగ‌స్టులో విడుద‌ల‌వుతుంది.