Begin typing your search above and press return to search.
కొత్త మలుపు: సిట్ విచారణపై హైకోర్టుకు చార్మి
By: Tupaki Desk | 24 July 2017 7:35 AM GMTతీవ్ర సంచలనంగా మారిన డ్రగ్స్ విచారణ వ్యవహారంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలకు సిట్ నోటీసులు ఇవ్వటం తెలిసిందే. నోటీసులు అందుకున్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. నోటీసులు అందుకున్న వారిలో ఇద్దరు నటీమణులు సౌతం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 26న సిట్ ఎదుటకు హాజరు కావాల్సిన మాజీ హీరోయిన్ చార్మి అనూహ్యంగా హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టుకు ఆమె చేసుకున్న దరఖాస్తులో సిట్ విచారణ తీరు బాగోలేదని పేర్కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది. విచారణలో భాగంగా గోళ్లు.. రక్త నమూనాలు సేకరించటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేయటం గమనార్హం. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా శాంపిల్స్ సేకరించటం సరికాదంటూ రూల్ ను తెర మీదకు తీసుకొచ్చారు. విచారణ సందర్భంగా గోళ్లు.. రక్త నమూనాలు సేకరించే సమయంలో వ్యక్తి ఇష్టాల్ని పరిగణలోకి తీసుకోవాలే తప్పించి.. బలవంతంగా సేకరించటం సరికాదని పేర్కొనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు.. విచారణకు హాజరయ్యే పక్షంలో తన వెంట న్యాయవాదిని కూడా అనుమతించాలని చార్మి కోరటం గమనార్హం. చార్మి దాఖలు చేసుకున్న పిటీషన్ హైకోర్టు ఎదుట ఈ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటివరకూ నోటీసులు అందుకున్న సినీ సెలబ్రిటీలకు భిన్నంగా చార్మి హైకోర్టును ఆశ్రయించటం ఈ కేసులో కొత్త మలుపుగా అభివర్ణిస్తున్నారు. మరి.. చార్మి పిటీషన్ పై హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు.