Begin typing your search above and press return to search.
ఆ క్షణం ఛార్మికి దిమ్మ తిరిగిపోయింది
By: Tupaki Desk | 9 Jun 2015 3:59 PM GMTజీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక భయానక సంఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ క్షణం అయిపోయానేమో అనిపించడం ఖాయం. అలాంటి సందర్భం ఎప్పుడైనా రావొచ్చు. అయితే సరిగ్గా అలాంటప్పుడే మనచుట్టూ పాజిటివ్‌గా ఉండే మనుషులు కనిపిస్తే కొండత ధైర్యం వచ్చేస్తుంది. లైట్ హార్టెడ్‌గా ఉంటేనే ఈ రోజుల్లో మనుగడ సాగించగలం. సరిగ్గా ఇలాంటి సందర్భమే జ్యోతిలక్ష్మి షూటింగులో అందాల ఛార్మికి ఎదురైంది.
ఓ సీన్‌లో నటిస్తున్నప్పుడు జూనియర్ ఆర్టిస్టు ఒకరు హాకీ స్టిక్‌తో బలంగా మొహంపై మోదారు. ఆ దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇక కెరీర్ ముగిసినట్టేనేమో అనుకున్నా. తిరిగి నా అందం యథాతథంగా ఉండదేమో అని భయపడిపోయాను. అయితే ప్లాస్టిక్ సర్జన్, డాక్టరు ఏం ఫర్వాలేదు. అంతా సెట్‌రైట్ అయిపోయింది అన్న తర్వాతే హమ్మయ్య అనుకున్నా. అంతవరకూ మాట గుండెల్లోనే ఉండిపోయింది. గొంతువరకూ రానేలేదు. ఆ క్షణం ఎంతో ఆనందించాను.. అంటూ చెప్పుకొచ్చింది.
గోవా షూటింగులో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు .. నేనే నిర్మాతని అయితే.. అవన్నీ నాకు ఓకే.. అని పూరీ జోక్ వేయడంతో వాతావరణం అంతా తేలికైపోయిందని ఛార్మి చెప్పింది. పూరి ఉన్నచోట పాజిటివ్‌నెస్‌తో కూడిన ఆహ్లదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పింది. అలాంటివారితో కలిసి పనిచేస్తే ఎలాంటి భయాలు ఉండవని కితాబిచ్చింది. అదీ సంగతి.