Begin typing your search above and press return to search.

డియర్‌ మంత్రా ఎందుకిలా చేశావ్‌?

By:  Tupaki Desk   |   31 July 2015 6:16 PM GMT
డియర్‌ మంత్రా ఎందుకిలా చేశావ్‌?
X
ఛార్మింగ్‌ మంత్ర ఛార్మి ఏం చేసినా అందులో సంథింగ్‌ ఉంటుంది. పూరీ తో కలిసి ప్రొడక్షన్‌ భాగస్వామిగా పనిచేస్తూ టాలీవుడ్‌ ని ఏలాలని కలలుగన్నా మధ్యలో ఆ ఆలోచన కాస్తా విరమించుకుంది. ఏదేమైనా అదంతా గతం. వర్తమానంలోకి వస్తే ఛార్మి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి నటించిన మంత్ర-2 ఈరోజు రిలీజైంది. అయితే అది రిలీజైంది అన్న సంగతే ఎవరికీ తెలీదు. కనీసం ఆన్‌ లైన్‌ లో రివ్యూలు కూడా అందుబాటులో లేవంటే ప్రచారం ఎంత హీనపక్షంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సినిమా రిలీజవుతోంది అంటే కనీసం కథానాయికల చిట్‌ చాట్‌ ల హడావుడి అయినా ఉంటుంది. జ్యోతిలక్ష్మి సినిమా టైమ్‌ లో ఛార్మి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఆ సినిమాకి చేసినంత ప్రచారం ఈ సినిమాకి ఎందుకు చేయలేదు?

మంత్ర అనే హిట్‌ సినిమాకి సీక్వెల్‌, మరో హిట్‌ కొడతా అని ప్రచారం చేస్తుందనుకుంటే అస్సలు మీడియాకి కనిపించనేలేదెందుకో? అసలింతకీ మంత్ర 2 హిట్టా? ఫట్టా? అన్నది కూడా తెలియడం లేదే. ఎవరిని అడిగినా రిలీజైందా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తెలుగు ప్రేక్షకులు తన బొమ్మ గోడ పోస్టర్‌ లో చూస్తే చాలు థియేటర్‌ కి వచ్చి హిట్‌ చేసేస్తారన్న మొండి ధైర్యంతో ఇలా ప్రచారాన్ని గాలికి వదిలేసిందా? అన్న సందహాలొస్తున్నాయ్‌. ఛార్మీ ఏం మాట్లాడవేం?