Begin typing your search above and press return to search.

ఆ ఆప్ష‌న్ అక్క‌ర్లేద‌న్న చార్మి!

By:  Tupaki Desk   |   23 July 2017 6:38 AM GMT
ఆ ఆప్ష‌న్ అక్క‌ర్లేద‌న్న చార్మి!
X
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది డ్ర‌గ్స్ కేసు విచార‌ణ ఉదంతం. స్కూలు పిల్ల‌లు.. సంప‌న్నుల ఇళ్ల‌ల్లోని వారు మాత్ర‌మే కాదు.. సినీ తార‌ల్లో ప‌లువురు డ్ర‌గ్స్ మ‌త్తులో చిక్కుకున్నార‌న్న ఉదంతం బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది. గ‌తంలో ఇలాంటి వార్త‌లు చాలానే వ‌చ్చినా.. ఇప్ప‌టి మాదిరి నోటీసులు.. వివ‌ర‌ణ‌లు.. విచార‌ణ‌ల వ‌ర‌కూ వ‌చ్చింది లేదు.

ఏదో ప‌ది రోజుల హ‌డావుడిగా కాకుండా.. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం డ్ర‌గ్స్ కేసు విచార‌ణ పాగ‌టంతో ప‌లువురు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రోజులు గ‌డుస్తున్న కొద్దీ.. అంత‌కంత‌కూ లోతుల్లోకి వెళ్ల‌టం.. కొత్త కొత్త పేర్లు తెర మీద‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

గ‌డిచిన కొద్ది రోజులుగా టాలీవుడ్ సెల‌బ్రిటీల‌ను విచారిస్తున్న అధికారులు కొత్త వివ‌రాల్ని సేక‌రిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈ స‌మాచారంతో పాటు.. డ్ర‌గ్స్ కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్న వారి నుంచి సేక‌రించిన స‌మాచారంతో మ‌రికొంద‌రికి నోటీసులు జారీ చేయ‌టాని భావిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. నోటీసులు అందుకున్న సినీ ప్ర‌ముఖుల్లో ఇప్ప‌టివ‌ర‌కూ అధికారులు మ‌హిళ‌ల్ని విచారించింది లేదు. మొద‌ట విచార‌ణ‌ను మాజీ హీరోయిన్ చార్మిని సిట్ అధికారులు విచారించ‌నున్నారు. అయితే.. ఈ విచార‌ణ‌లో మ‌హిళ‌ల‌కు ఒక స‌దుపాయం ఇవ్వాల‌ని అధికారులు భావించిన‌ట్లుగా చెబుతున్నారు.

సిట్ కార్యాల‌యానికి రాన‌క్క‌ర్లేద‌ని.. వారు కోరుకున్న చోట విచారించ‌టానికి సిట్ సిద్ద‌మ‌న్న స‌మాచారాన్ని చార్మికి తెలియ‌జేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంట్లో కానీ.. ఆమె కోరుకున్న మ‌రే ప్ర‌దేశంలో అయినా విచార‌ణ జ‌రుపుతామ‌న్న స‌మాచారాన్ని ఆమెకు తెలియ‌జేసిన‌ట్లుగా స‌మాచారం. అయితే.. అధికారులు ఇచ్చిన ఆప్ష‌న్ కు చార్మి నో చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

మిగిలిన వారి మాదిరే తాను కూడా సిట్ కార్యాల‌యానికి వ‌స్తాన‌ని చెప్పిన‌ట్లుగా స‌మాచారం. అంద‌రిలానే తన‌ను కూడా సిట్ కార్యాల‌యంలోనే విచారించాల‌ని చార్మి చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. విచార‌ణ అధికారులు ఇచ్చిన స‌దుపాయాన్ని చార్మి వ‌ద్ద‌ని చెప్ప‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి.. అధికారుల ద‌ర్యాప్తులో మ‌రెన్ని ఆస‌క్తిక‌ర అంశాలు తెర మీద‌కు వ‌స్తాయో చూడాలి.