Begin typing your search above and press return to search.

రౌడీకి కొత్త పేరు పెట్టిన ఛార్మి

By:  Tupaki Desk   |   10 May 2021 7:30 AM GMT
రౌడీకి కొత్త పేరు పెట్టిన ఛార్మి
X
రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు సందర్బంగా లక్షల మంది అభిమానులు మరియు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానులు తమకు ఉన్న అభిమానంను వివిధ మార్గాలుగా చూపిస్తూ రౌడీ స్టార్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయగా సెలబ్రెటీలు కూడా ఆయనతో ఉన్న అనుబంధంను షేర్‌ చేసుకుని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి పుట్టిన రోజు విషెష్‌ తో పోల్చితే ఛార్మి విషెష్‌ చాలా స్పెషల్‌ గా ఉందంటూ టాక్‌ వినిపిస్తుంది.

విజయ్ గురించి ఒక్క లైన్‌ లో చెప్పాలంటే 26 కేరట్ ల బంగారం అంటూ ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. విజయ్ తో ఉన్న ఫొటోను షేర్‌ చేసి బంగారం అంటూ సంభోదిస్తూ తనకు రౌడీ స్టార్‌ అంటే ఎంత ప్రత్యేకమైన అభిమానమో చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్‌ సినిమా కు ఛార్మి ఒక నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈమద్య కాలంలో నటిగా పెద్దగా కనిపించని ఛార్మి వరుసగా సినిమాల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తుంది.

లైగర్‌ సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. సినిమా ప్రారంభం అయినప్పటి నుండి సందర్బానుసారంగా ఛార్మి సోషల్‌ మీడియాలో విజయ్‌ దేవరకొండతో ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తూనే ఉంది. ఈసారి ఆయన బర్త్‌ డే సందర్బంగా కొత్త పేరు పెట్టి అందరి అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిచింది. విజయ్ దేవరకొండను ఇకపై ప్రేమగా ముద్దుగా బంగారం అంటూ పిలుచుకుంటారేమో చూడాలి.