Begin typing your search above and press return to search.

మిడిల్ ఫింగ‌ర్ ఎత్తి చూపిందేం?

By:  Tupaki Desk   |   3 Dec 2018 4:20 AM GMT
మిడిల్ ఫింగ‌ర్ ఎత్తి చూపిందేం?
X
మ‌ధ్య వేలు ఎత్తి చూపితే దాన‌ర్థం ఏంటో తెలుసు క‌దా? నీలాంటి డ‌కోటా బాబుల‌ను చాలామందిని చూసానులే.. ఎల్లెళ్ల‌వ‌య్యా అని అర్థం. ఇలా మిడిల్ ఫింగ‌ర్ చూపించాల్సినంత అవ‌స‌రం ఏం వ‌చ్చిందో కానీ.. పంజాబీ కుడి ఛార్మి చాలా సీరియ‌స్‌ గానే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ సీరియ‌స్‌ నెస్ కి త‌గ్గ‌ట్టే రంగు - రూపం మారిపోయింది. చూస్తుండ‌గానే చాలా మారిపోయింది. మితిమీరిన బొద్ద‌యిన రూపం.. నిదుర‌లేమితో కంటి కింద చార‌లు.. ఇత‌ర‌త్రా అన్నీ తెలిసిపోతున్నాయి.

కార‌ణం ఏదైనా .. ఇండ‌స్ట్రీపై ప‌ట్టు సంపాదించాల‌న్న త‌న క‌ల నెర‌వేరలేదు. నిర్మాత‌గా తొలి వైఫ‌ల్యం తీవ్రంగానే ప్ర‌భావం చూపించింది. మెహ‌బూబా ఫ్లాప్ త‌ర్వాత ఛార్మి మ‌ళ్లీ తెలుగు మీడియాలో క‌నిపించ‌నేలేదు. అయినా పోగొట్టుకున్న చోటే రాబ‌ట్టుకోవాల‌న్న పంతం త‌న‌లో ఉంద‌న్న మాటా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆకాష్ పూరి హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ నిర్మాత‌గా .. కొత్త కుర్రాడు అనీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా సెట్స్‌ పైకి వెళ్ల‌నుంది. ఈ నెల‌లోనే ప్రారంభోత్స‌వం సాగుతోంద‌న్న మాటా వినిపిస్తోంది. పూరి కేవ్‌ లో ప్ర‌స్తుతం ఆ ప‌నుల‌న్నీ చురుగ్గా సాగుతున్నాయి. త‌న‌యుడి కెరీర్‌ ని నిల‌బెట్ట‌డ‌మే ధ్యేయంగా పూరి స్టెన్ గ‌న్ ఎక్కుపెట్టాడు.

ఈ చిత్రానికి కాస్టింగ్ సెల‌క్ష‌న్ స‌హా ప్ర‌తిదీ ఛార్మినే బాధ్య‌త‌లు తీసుకుంటున్నారా? పూరి క‌నెక్ట్స్ సీఈవోగా ఆ ప‌నిలో ఛార్మి బిజీగా ఉన్నారా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. అయితే ఇలా మిడిల్ ఫింగ‌ర్ చూపించింది ఎవ‌రికో..? అయినా ఎవ‌రేమ‌న్నార‌ని? పోగొట్టుకున్న చోట రాబ‌ట్టుకునే ఆలోచ‌న స‌రైన‌దే. పంతం ప‌ట్టుద‌ల ఉండాలే కానీ - అప‌జ‌యం త‌లొంచాలి. వెన్ను చూపి పారిపోవాలి. యుద్ధంలో గెలుపే ఆలంబ‌న కావాలి. ఎయిమ్ ఫ‌ర్ లెవంత్ మైల్ అని గురూజీ పూరి చెప్ప‌క‌నే చెప్పారు. ఛార్మి లోని ఈ ఫైర్ ఆ కోణంలో వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.