Begin typing your search above and press return to search.
సెట్లో అనన్య ఎనర్జీపై ఛార్మి ట్వీట్
By: Tupaki Desk | 25 Oct 2021 2:30 PM GMTవిచారణలు ఒక వైపు.. చిత్రీకరణలు మరోవైపు.. ఎవరి పనిలో వాళ్లున్నారు! ఇక లైగర్ టీమ్ తమ పనిలో తాము ఉన్నామని నిరూపిస్తోంది. తాజాగా క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారూక్ కుమారుడు ఆర్యన్ ని విచారించే క్రమంలో అనన్య పాండే పేరు తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనన్యను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మూడవసారి ప్రశ్నించేందుకు సిద్ధమైంది.
అయితే అనన్య వృత్తిపరమైన కట్టుబాట్ల వల్ల ఎన్ సిబి విచారణకు హాజరుకాలేదని తెలిసింది. తన షెడ్యూళ్లను ఏమాత్రం విడిచిపెట్టడం లేదు అనన్య పాండే. తిరిగి వృత్తిలో నిమగ్నమవుతోంది. ప్రస్తుతం నటిస్తున్న లైగర్ చిత్రీకరణకు సహకరిస్తోంది. తాజాగా లైగర్ సహనటుడు విజయ్ దేవరకొండతో పాటు చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. ఈ పాటను ముంబైలో తెరకెక్కిస్తున్నారు. సోమవారం షూట్ గురించి ఒక అప్ డేట్ ను షేర్ చేస్తూ చిత్ర సహ నిర్మాత ఛార్మీ కౌర్ సోషల్ మీడియాలో చాలా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
పనిలో పనిగా దేవరకొండ న్యూ లుక్ ఫోటోని ఛార్మి షేర్ చేశారు. ఇందులో ఆ ఉంగరాలు తాయత్తుల సంగతేంటి లైగరూ? అంటూ అభిమానులు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు.
``ముంబైలో #LIGER సాంగ్ షూట్ చేస్తున్నాం. నన్ను నమ్మండి.. @ దేవరకొండ మునుపెన్నడూ లేని విధంగా డ్యాన్స్ చేస్తున్నాడు. పూర్తి భారీ వెర్రి విందును ఆశించండి`` అని ఛార్మి దీనికి వ్యాఖ్యను జోడించింది. అనన్యను ఉద్ధేశిస్తూ.. ``PS - ఈ ట్వీట్ ఆడ్రినలిన్ రష్ కారకం.. నేను ఇప్పుడు ఈ హాటీ శక్తిని (sic) చూస్తున్నాను`` అంటూ ఛార్మి నర్మగర్భంగానే వ్యాఖ్యను జోడించింది. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండను మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపిస్తాడు. బాలీవుడ్ లో అతడికి ఇది అరంగేట్రం కూడా. ఇది తెలుగు- తమిళం- కన్నడ-మలయాళంలో కూడా విడుదల కానుంది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో నటించనున్నారు. దేవరకొండ అతడితో పోరాట సన్నివేశాల్లో నటిస్తున్నారు. రమ్య కృష్ణన్- రోనిత్ రాయ్- విషు రెడ్డి- అలీ- మకరంద్ దేశ్‌పాండే -గెటప్ శ్రీను తదితరులు నటించారు. పూరి కనెక్ట్స్ - ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై పూరి జగన్నాధ్- ఛార్మీ కౌర్- కరణ్ జోహార్ - అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2022లో విడుదల కానుంది. దేవరకొండ తదుపరి సుకుమార్ .. శివ నిర్వాణతో సినిమాలు చేయనున్నారు.