Begin typing your search above and press return to search.

ఛార్మీ ఇంట విషాదం.. మాటలు రావడం లేదంటూ ఎమోషన్‌

By:  Tupaki Desk   |   17 July 2020 2:00 PM GMT
ఛార్మీ ఇంట విషాదం.. మాటలు రావడం లేదంటూ ఎమోషన్‌
X
హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా దశాబ్ద కాలం పాటు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసిన ఛార్మీ ప్రస్తుతం నిర్మాతగా మారింది. ఐటెం సాంగ్స్‌ తో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆఫర్లు వస్తున్నా కూడా ప్రొడక్షన్‌ పై ఆసక్తితో పూరితో కలిసి సినిమాల నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెట్టే ఛారీ తాజాగా తన ఫ్యామిలీ మెంబర్‌ మృతిని షేర్‌ చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది. నీవు చనిపోయావు అనే మాట నచ్చడం లేదు. జీవితంలో అలా జరగాలి కనుక తప్పదంటూ ఛార్మీ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.

నిన్న మనం వీడియో కాల్‌ మాట్లాడుకున్నాం. ఆ వీడియో కాల్‌ చివరిది అవుతుందని ఊహించలేదు. ఈ విషయమై స్పందించేందుకు మాటలు రావడం లేదు. స్వర్ఘంలో కూడా నీవు సంతోషంగా ఉంటావని.. నీకు నచ్చిన వైన్‌ ను తాగుతూ ఎంజాయ్‌ చేస్తూ ఉంటావని ఆశిస్తున్నాను. పైనే ఉన్న అప్పి తో నువ్వు కలిసి మంచి సమయంను గడుపుతూ ఉంటావనుకుంటున్నాను. నీ చిరు నవ్వును నేను మిస్‌ అవుతాను. నీవు లేని లోటు ఎవ్వరు తీర్చలేరు. నా ప్రియమైన ఆంటీ నీ ఆత్మకు శాంతి కగాలని కోరుకుంటున్నాను అంది.

సోషల్‌ మీడియాలో ఛార్మీ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. ఆ ఆంటీ ఎవరు.. ఛార్మి ఫ్యామిలీలో ఆమె స్థానం ఏంటీ అనే విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరు ఛార్మీని ఓదార్చుతూ ఆంటీకి ఆర్‌ ఐ పీ అంటూ కామెంట్‌ పెడుతున్నారు.