Begin typing your search above and press return to search.

ఐస్మార్ట్ గా మార్చే దుస్తులు కావాలా?

By:  Tupaki Desk   |   3 Jun 2019 5:07 AM GMT
ఐస్మార్ట్ గా మార్చే దుస్తులు కావాలా?
X
దర్శకుడు పూరి జగన్నాధ్ రామ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న ఐస్మార్ట్ శంకర్ షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉంది. ఇప్పటికే విడుదలైన మాస్ టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా త్వరలో వినూత్నమైన రీతిలో ప్రమోషన్ ని వేగవంతం చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఐస్మార్ట్ శంకర్ లో వాడిన క్రేజీ దుస్తులను అభిమానులకు ప్రేక్షకులకు అందించే ఉద్దేశంతో టీం ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది.

ఐస్పెషల్ పేరుతో ఓ క్లాతింగ్ బ్రాండ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఐస్మార్ట్ శంకర్ లో హీరో హీరొయిన్లతో సహా లీడ్ క్యాస్టింగ్ అంతా వాడిన కాస్ట్యూమ్స్ అందించబోతున్నారు. అయితే దీనికి బీఐస్మార్ట్ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినవి ఎంచుకునే ఆప్షన్ దక్కుతుంది. దీనికి భారీ స్పందన వచ్చే అవకాశముందని టీమ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. ఆ దుస్తుల్లో ఛార్మీ సందడి చేస్తున్న పిక్ కూడా వైరల్ అవుతోంది.

ఒకవైపు బాలన్స్ షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేసుకుంటున్న ఐస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మిస్టర్ మజ్ను ఫేమ్ నిధి అగర్వాల్ నన్ను దోచుకుందువటేతో పేరు తెచ్చుకున్న నభ నటేష్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం మరో ఆకర్షణగా నిలుస్తోంది. పోకిరి కాంబో రిపీట్ అవుతోంది కాబట్టి మ్యూజిక్ లవర్స్ కూడా గట్టి అంచనాలే పెట్టుకున్నారు. రామ్ ఊర మాస్ గెటప్ ప్లస్ డైలాగ్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి