Begin typing your search above and press return to search.
నన్ను అనుమానించి సహనటులకు SMS లు పంపేవాడు!
By: Tupaki Desk | 26 Oct 2022 2:30 AM GMTమాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్ రోహ్ మన్ షాలు నుంచి విడిపోయి ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఐపీఎల్ సృష్టికర్త గ్రేట్ బిజినెస్ మేన్ లలిత్ మోడీతో ప్రేమాయణం పెళ్లి అంటూ బోలెడంత సందడి.. ఆ వెంటనే ఇద్దరూ బ్రేకప్ అయ్యారని కూడా కొన్ని మీడియాలు అలజడిని సృష్టించాయి. తిరిగి తన పాత బోయ్ ఫ్రెండ్ రోహ్ మన్ తో సెటిలవుతోందని కూడా కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి. ఇప్పటికీ ఈ టాపిక్ ట్రెండింగ్ గానే ఉంది. ఇంతలోనే సుస్మితాసేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకుల గురించి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర కథనాలు వైరల్ అవుతున్నాయి.
గత కొన్ని నెలలుగా రాజీవ్ సేన్ తన భార్య చారు అసోపాతో వైవాహిక జీవితం డైలమాలో ఉందని కథనాలొస్తున్నాయి. ఈ జంట ఒకరి నుండి ఒకరు విడిపోవాలనే నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ తాజా సమాచారం మేరకు... చారు అసోపా తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టెలివిజన్ నటి చారు భర్తపై పలు రకాల ఆరోపణలు చేసింది. పరిశ్రమలో ఎవరితోనైనా కలిసి పని చేయాలంటే దానిని అడ్డగిస్తాడని ఇటీవలి ప్రకటనలో వెల్లడించింది.
తాజా ఇంటర్వ్యూలో చారు అసోపా మాట్లాడుతూ.. అతడు తన సహనటులను తన నుండి దూరంగా ఉండమని ఎలా హెచ్చరిస్తాడనే దాని గురించి మాట్లాడింది. అంతేకాదు సేన్ తనను మోసం చేశాడని ఆరోపించింది. ``రాజీవ్ టెంపరితనం ఉన్నవాడు.. దుర్భాషలాడతాడు ... ఒకటి లేదా రెండుసార్లు నాపై చేయి కూడా ఎత్తాడు.
తనను మోసం చేసినట్లు అనుమానించేవాడు. నేను `అక్బర్ కా బల్ బీర్బల్` షూటింగ్ చేస్తున్నప్పుడు అతను నాకు దూరంగా ఉండమని నా సహ నటులకు సందేశాలు (ఎస్.ఎం.ఎస్ లు) పంపాడు. నాకు పని చేయడం కష్టంగా మారింది. అతను నన్ను మోసం చేస్తున్నాడని నేను భావిస్తున్నాను. కానీ అది నేను నిరూపించలేని విషయం... అని చారు పలు ఆరోపణలు చేసింది.
``నేను విడాకుల ప్రక్రియను ప్రారంభిస్తాను. మరింత ఇబ్బంది కలిగించకుండా అతను దానిని అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను. గతంలో లాగా నేను భరణం అడగలేదు. ఈ పెళ్లిని ఇంకా సాగదీయడం నాకు ఇష్టం లేదు. నేను ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు వృధా చేసాను`` అని చారు అంది.
చారు అసోపా - రాజీవ్ సేన్ జూన్ 2019లో ప్రయివేటుగా వివాహం చేసుకున్నారు. జూన్ 2022లో విడిపోతున్నామని ప్రకటించారు. ఆ తర్వాత ఈ జంట ఆగస్టులో తమ వివాహబంధానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే గత నెలలో తన భర్త తనను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడని చారు పేర్కొన్న తర్వాత వారి వివాహం సమస్యలో ఉన్నట్లు కథనాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ దంపతులకు జియానా అనే 11 నెలల కూతురు ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.