Begin typing your search above and press return to search.
వీడియో సాంగ్: చక్కెర పాకం లాంటి ప్రేమ
By: Tupaki Desk | 1 May 2019 7:50 AM GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా భారత్ వచ్చే నెల 5న ఈద్ పండగ సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది. ప్రతి రంజాన్ కు ఇలా కానుక ఇచ్చే సల్లు భాయ్ గత ఏడాది రేస్ 3 రూపంలో షాక్ తిన్నాడు. అందుకే ఈసారి గట్టి హిట్టు కొట్టాలనే లక్ష్యంతో టైగర్ జిందా హై దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ని ఎంచుకున్నాడు. ప్రమోషన్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్న టీం తాజాగా వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది.
చాశిని అంటూ సాగే ఈ స్వీట్ మెలోడీలో సల్మాన్ కత్రినాల జోడి క్యుట్ గా ఉంది. చాసిని అంటే చక్కర పాకం. జిలేబీలను నూనెలో మరిగించాక అందులో నుంచి తీసి చక్కర పాకంలో నానబెడతారు. ఇందులో ఓ సీన్ లో కత్రినా కైఫ్ అలాంటి ఓ జిలేబీని నోట్లో వేసుకోవడం చూసి సల్మాన్ మనసు పారేసుకుంటాడు. అందుకే ప్రేయసిని అలా పోల్చే విధంగా సమకూర్చిన ఇర్షాద్ కామిల్ సాహిత్యానికి విశాల్ శేఖర్ సంగీతంలో ఫీల్ గుడ్ ట్యూన్ వచ్చింది
విజువల్స్ కూల్ గా ఉన్నాయి. పరిచయం అయిన క్షణంతో మొదలుపెట్టి తన ప్రేయసితో భారత్ ఊహాలోకాల్లో విహారం చేయడం లాంటి సీన్స్ బాగా సింక్ అయ్యాయి. సల్మాన్ మీసకట్టుతో అందంగా ఉన్నాడు. రాజేష్ ఖన్నా హయాంలో 1974 ప్రాంతంలో జరిగిన నేపధ్యంగా చూపించారు కాబట్టి కాస్ట్యూమ్స్ తో పాటు వాతావరణం కూడా అదే ప్రతిబింబించింది.
మొత్తానికి సల్మాన్ మరోసారి ప్రేమికుడిగా భారత్ రూపంలో వచ్చాడు. దేశ విభజన తర్వాత ఓ కుటుంబం విడిపోయి నాన్నకు ఇచ్చిన మాట కోసం భారత్ అనే యువకుడు తన చివరి శ్వాస దాక ఏం చేసాడు అనే కాన్సెప్ట్ తో రూపొందిన భారత్ సుమారు వంద కోట్ల బడ్జెట్ తో తీసినట్టుగా బాలీవుడ్ టాక్.