Begin typing your search above and press return to search.
'చావు కబురు చల్లగా' ట్రైలర్: విడో ప్రేమ కోసం పరితపించే బస్తీ బాలరాజ్ కథ
By: Tupaki Desk | 5 March 2021 12:20 PM GMTయువ హీరో కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''చావు కబురు చల్లగా''. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో 'చావు కబురు చల్లగా' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'ఎవరొచ్చినా పర్లేదండి.. ఎత్తుకెళ్ళిపోతాం.. అంతిమయాత్రకి' అని హీరో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇందులో కార్తికేయ శవాలని తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ బస్తీ బాలరాజు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో శవాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన బాలరాజు.. చనిపోయిన వ్యక్తి భార్య మల్లిక (లావణ్య త్రిపాఠి) ని ఇష్టపడినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'నువ్ నంబర్ వన్ వెధవవి.. నేనే కాదు ప్రపంచంలో ఏ అమ్మాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోదు' అని లావణ్య అంటుండగా.. ''అమ్మాయిలకి ఎట్టాగా ఎదవలే నచ్చుతారంట కదా.. నేను నెంబర్ వన్ అయినప్పుడు నన్ను మించిన ఆప్షన్ ఏముంటది'' అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. 'చావు ఇంటికి వచ్చిన ఎవరికైనా ప్రేమ పుడుతుందా' అని అడగ్గా.. 'రోజూ బడికిపోయేటోడు బళ్ళో పిల్లని చూసి ఇష్టపడతాడు.. రోజూ ఉద్యోగానికి పోయేతోడు ఆఫీసులో పిల్లని చూసి ఇష్టపడతాడు.. రోజూ చావులకు వెళ్ళేతోటు చావు దగ్గర కాకుండా ఇంక ఎక్కడ ఇష్టపడతాడు' అంటూ చెప్పడం అలరోస్తోంది. 'మా ఆయన సమాధి పక్కన నిన్ను కూడా పడుకోబెట్టి పాతి పెడతా' అని హీరోయిన్ వార్నింగ్ ఇస్తుంటే.. 'ఆ శ్మశానములో ఇచ్చే చోటేదే నీ మనసులో ఇయ్యిచుగా' అంటూ విడో ప్రేమ కోసం హీరో చేసే ఎంతగా ట్రై చేస్తున్నాడో చూపించారు.
ఇందులో కార్తికేయ లుక్ కొత్తగా ఉండటంతో పాటు.. మేనరిజం డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. లావణ్య త్రిపాఠి విడో నర్స్ పాత్రలో డీ గ్లామరస్ గా నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో కనిపించింది. ఈ చిత్రంలో ఆమని - మురళీ శర్మ - శ్రీకాంత్ అయ్యంగర్ - మహేష్ - భద్రం ఇతర పాత్రలు పోషించారు. 'చావు కబురు చల్లగా' చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. జీఎమ్ శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు. మొత్తం మీద 'చావు కబురు చల్లగా' ట్రైలర్ ఆకట్టుకునే ఉండటంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు.