Begin typing your search above and press return to search.
`పోకిరి` సీన్స్ లేనే లేవ్.. లీకులకు థాంక్యూ
By: Tupaki Desk | 17 July 2022 5:43 PM GMTకమ్ముల `లవ్ స్టోరి`తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన నాగచైతన్య ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దా.. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన థాంక్యూ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ నెల 22న థాంక్యూ విడుదల కానుంది. ప్రస్తుతం విక్రమ్ కె టీమ్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇంతలోనే ఈ మూవీ స్టోరీ గురించి లీకులు అంతర్జాలంలో వేడి పెంచుతున్నాయి. ఇందులో చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబుకు అభిమానిగా నటిస్తున్నారు. పోకిరి మూవీని వీక్షించేందుకు చైతూ తన స్నేహితుల బృందంతో థియేటర్ కి వెళితే అక్కడ ఊహించని ఘర్షణ ఎదురవుతుందని కూడా ప్రచారం సాగిపోయింది.
ఇందులో పోకిరి స్ఫూర్తితో పోరాట సన్నివేశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విక్రమ్ కె. ఆ సన్నివేశాలన్నీ ఎడిట్ రూమ్ లో కట్ చేయాల్సి వచ్చిందని కూడా ప్రచారం సాగిపోతోంది. కథానాయకుడి జీవితంలోని మూడు దశలు ఉంటాయి. యువకుడిగా ఉడుకునెత్తురుతో స్ట్రీట్ ఫైట్స్ కి దిగుతాడు..! అని కూడా కథ గురించి లీకులు ప్రచారమైపోతున్నాయి. దుడుకుతనం చూపించే పోకిరి కుర్రాడి దశను స్క్రీన్ ప్లే పరంగ సాఫీగా ముందుకు సాగేందుకు దర్శకుడు పోకిరి స్ఫూర్తిని తీసుకుని ఉండవచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే పోకిరి స్ఫూర్తితో తెరకెక్కించిన సన్నివేశాలను విక్రమ్ కె ఎడిట్ రూమ్ లో తొలగించారని కూడా టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రచారంలో నిజం ఎంత? అంటే.. థాంక్యూ టీమ్ దీనిని ఖండించింది. ఏదైనా థియేటర్ ఫైట్ లేదా పోకిరి రిఫరెన్స్ ఫైట్ కు సంబంధించిన సన్నివేశాలను ఎప్పుడూ స్క్రిప్టులో రాయలేదని.. సెట్స్ లో చిత్రీకరించలేదని టీమ్ వెల్లడించింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 9 నిమిషాలు ఉండేలా చూసుకోవడానికి మేకర్స్ కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయించారు. కానీ పోకిరి స్ఫూర్తితో తెరకెక్కించిన సన్నివేశాలు ఇందులో లేవు! అని వెల్లడించారు.