Begin typing your search above and press return to search.
స్టార్ హీరోపై చీటింగ్ కేసు!
By: Tupaki Desk | 28 Aug 2018 12:10 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హృతిక్ తో సహా మరో 8 మందిపై చెన్నైలో చీటింగ్ కేసు నమోదైంది. వారంతా తనను రూ.21లక్షలకు మోసం చేశారని చెన్నైకు చెందిన మురళీధన్ కేసు నమోదు చేశాడు. దీంతో, హృతిక్ తో పాటు ఆ 8 మందిపై ఐపీసీ సెక్షన్ 420 కింద చీటింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. 2014లో హెచ్ ఆర్ ఎక్స్ పేరుతో ఓ షూస్ బ్రాండ్ ను హృతిక్ ప్రారంభించాడు. ఆ బ్రాండ్ కు స్టాకిస్ట్ గా మురళీధరన్ ను నియమించాడు. కొంతకాలం తనకు స్టాక్ సరిగానే పంపించారని, ఆ తర్వాత స్టాకు పంపడం ఆపేశారని మురళీధరన్ ఆరోపించాడు. కొంతకాలం క్రితం తనకు చెప్పకుండానే తన ఏరియాలోని మార్కెటింగ్ టీమ్ ను తొలగించారని చెప్పాడు.
మార్కెటింగ్ టీమ్ ను తొలగించడంతో వ్యాపారం పడిపోయిందని, సేల్స్ తగ్గిందని చెప్పారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న సరుకును తిప్పి పంపించేందుకు సంస్థ వారు అంగీకరించలేదని మురళీధరన్ ఆరోపించారు. తనకు సమాచారం ఇవ్వకుండానే తన సంస్థను మూసివేశారని ఆరోపించారు, దీంతో, తనకు రూ.21 లక్షల రూపాయల నష్టం వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మురళీధరన్ ఫిర్యాదు ఆధారంగా హృతిక్ రోషన్ - మరో ఎనిమిది మందిపై కొడుంగయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం హృతిక్ రోషన్ ....గణిత మేధావి ఆనంద్ కుమార్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న సూపర్ 30 మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. క్వీన్ దర్శకుడు వికాస్ బల్ రూపొందిస్తున్న ఈ చిత్రం జనవరి 2019లో విడుదల కానుంది.