Begin typing your search above and press return to search.
ప్రముఖ నటిపై యూపీలో ఛీటింగ్ కేసు!
By: Tupaki Desk | 12 July 2019 4:52 AM GMTరోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందునా రాజకీయాలు ఎప్పటికప్పుడు మారతాయి. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్న ఇద్దరు.. తర్వాతి కాలంలో కడుపులో కత్తి దించే వరకూ వెళ్లటం మామూలే. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా రాజకీయ రంగంలో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. అన్ని బాగున్నప్పుడు సదరు ప్రముఖుడి ఇంట జరిగిన పెళ్లికి ప్రధాని మోడీ స్వయంగా హాజరైన పరిస్థితి.
ఈ రోజున అదే ప్రముఖుడి కుమార్తె కమ్ బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు నమోదైన పరిస్థితి. మొన్నటి వరకూ అంతా బాగున్నప్పటికీ.. మోడీ మాష్టారితో తగువు పెట్టుకున్న తర్వాత నుంచి పరిణామాలన్ని మారిపోతున్న వైనం చూస్తే.. పెద్దాయనతో పెట్టుకోవటమే సదరు ప్రముఖుడి ఫ్యామిలీ చేసిన తప్పా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరా ప్రముఖుడంటారా? ఇంకెవరు.. బాలీవుడ్ లో షాట్ గన్ గా సుపరిచితుడు.. మొన్నటివరకూ బీజేపీ ఎంపీగా ఫేమస్ అయినా శత్రుఘ్న సిన్హానే.
బీజేపీ ఎంపీగా ఉన్న శత్రుఘ్న సిన్హా కొన్నినెలల క్రితం మోడీషాలను వ్యతిరేకించి పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరటం తెలిసిందే. బీజేపీలో శత్రుఘ్న ఉన్న వేళలో ఆయన ఇంట జరిగిన పెళ్లికి ప్రధానిగా ఉన్న మోడీ రావటం.. ఆయన రాకను తెలియజేస్తూ.. తమకు ఇచ్చిన మాటను తప్పకుండా ప్రధాని మోడీ నెరవేర్చటంపైన ఆనందంతో శత్రుఘ్న కుమార్తె కమ్ ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ట్వీట్ చేయటాన్ని మర్చిపోలేం.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లుగా.. రాజకీయ విభేదాలతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన శత్రుఘ్న ఫ్యామిలీ.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరఫున ఎంపీగా యూపీ నుంచి పోటీ చేస్తే.. ఆయన సతీమణి సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు.ఇదంతా ఒక ఎత్తు అయితే దాదాపు ఏడాది క్రితం (2018లో) యూపీలో నిర్వహించిన ఒక స్టేజ్ షోకు సోనాక్షి వస్తానని మాట ఇచ్చి రాలేదని.. ఈ కారణంగా ఆమెపై మోసం కేసు పెట్టాలంటూ కట్ ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేయటం.. ఆ వెంటనే వారు ఐపీసీ సెక్షన్ 420.. 406 సెక్షన్ల కింద ఛీటింగ్ కేసు నమోదు చేయటం గమనార్హం.
ప్రధానమంత్రే నేరుగా పెళ్లికి వెళ్లిన ఇంటి అమ్మాయిపైన ఛీటింగ్ కేసు నమోదు కావటం.. అది కూడా దాదాపు ఏడాది తర్వాత కావటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. మోడీ రాజ్యంలో తనను వ్యతిరేకించిన ప్రముఖుడి కుమార్తెపై కేసు నమోదు కావటం కచ్ఛితంగా రాజకీయమనే విమర్శలకు బీజేపీ నేతలు ఎలా బదులిస్తారో చూడాలి.