Begin typing your search above and press return to search.

'చెక్' ట్రైలర్: ఉరిశిక్ష పడిన ఖైదీ చెస్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు?

By:  Tupaki Desk   |   3 Feb 2021 1:20 PM GMT
చెక్ ట్రైలర్: ఉరిశిక్ష పడిన ఖైదీ చెస్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు?
X
యూత్ స్టార్ నితిన్ - క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ జీవిత నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ - ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా 'చెక్' ట్రైలర్ విడుదల చేసింది.

'యద్భావం తద్భవతి.. అణువు నుంచి అనంతం వరకు ఏదీ ఖర్మను తప్పించుకోలేరు' అంటూ వచ్చే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ చెస్ గేమ్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు అర్థం అవుతోంది. ఇందులో నితిన్ తరపున వాదించే లాయర్ గా రకుల్ కనిపిస్తోంది. అయితే చెస్ ఆటలో ఎక్స్పర్ట్ అయిన హీరో ఎందుకు అరెస్ట్ అయ్యాడు.. అతనిపై టెర్రరిస్ట్ అనే ముద్ర పడటానికి కారణం ఏంటి.. చెస్ ఆట అతని జీవితంలో ఎలాంటి రోల్ ప్లే చేసింది అనే అంశాలతో 'చెక్' తెరకెక్కింది. ఆధ్యంతం ఆసక్తికరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేలా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చారు. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో సాయి చంద్ - మురళీశర్మ - సంపత్ రాజ్ - సిమ్రాన్ చౌదరి - హర్ష వర్ధన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.