Begin typing your search above and press return to search.
కోటి కూడా చేరలేకపోయిన చెలియా
By: Tupaki Desk | 9 April 2017 8:26 AM GMTఅనుకున్నదే అయింది. ‘చెలియా’ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. తొలి రోజు ఈ సినిమా వసూళ్లు పూర్తిగా నిరాశ పరిచాయి. పోటీయే లేకుండా సోలోగా.. కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయలేకపోయింది. కేవలం రూ.65 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ నామమాత్రమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కలిపితే ఆరున్నర లక్షలు మాత్రమే షేర్ రావడాన్ని బట్టి ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. మణిరత్నం సినిమాలంటే మామూలుగానే ‘ఎ’ సెంటర్లకు పరిమితం. బి-సి సెంటర్లలో ఆదరణ తక్కువ. ‘చెలియా’ మరింతగా వాళ్లకు దూరమైంది. సగటు ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కాని సినిమా కావడంతో మాస్ సెంటర్లలో సినిమాకు వసూళ్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి.
తొలి రోజు ఏరియాల వారీగా ‘చెలియా’ షేర్స్ వివరాలు..
నైజాం-రూ.22 లక్షలు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.6.5 లక్షలు
సీడెడ్ (రాయలసీమ)-రూ.10 లక్షలు
తూర్పు గోదావరి-రూ.5.5 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.3.7 లక్షలు
గుంటూరు-రూ.4.5 లక్షలు
కృష్ణా- రూ.4.81 లక్షలు
నెల్లూరు-రూ.2.75 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.65 లక్షలు
తొలి రోజు ఏరియాల వారీగా ‘చెలియా’ షేర్స్ వివరాలు..
నైజాం-రూ.22 లక్షలు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.6.5 లక్షలు
సీడెడ్ (రాయలసీమ)-రూ.10 లక్షలు
తూర్పు గోదావరి-రూ.5.5 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.3.7 లక్షలు
గుంటూరు-రూ.4.5 లక్షలు
కృష్ణా- రూ.4.81 లక్షలు
నెల్లూరు-రూ.2.75 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.65 లక్షలు