Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'చెలియా'
By: Tupaki Desk | 7 April 2017 9:34 AM GMTచిత్రం: ‘చెలియా’
నటీనటులు: కార్తి - అదితి రావు హైదరి - ఆర్జే బాలాజి - లలిత - శ్రద్ధా శ్రీనాథ్ - ఢిల్లీ గణేష్ తదితరులు
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: రవివర్మన్
మాటలు: కిరణ్
నిర్మాత: దిల్ రాజు
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మణిరత్నం
మణిరత్నం.. మన సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. మూడు దశాబ్దాలకు పైగా సాగుతున్న సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నెన్నో క్లాసిక్స్ అందించాడు ఈ దిగ్దర్శకుడు. మధ్యలో కొంచెం లయ తప్పినా.. ‘ఓకే బంగారం’తో మళ్లీ వెండితెరపై తన మ్యాజిక్ రిపీట్ చేసిన మణి.. ఇప్పుడు మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే.. చెలియా. కార్తి-అదితిరావు జంటగా తెరకెక్కిన ఈ ప్రేమకథతో మణి మరోసారి మాయాజాలం చేశాడో లేదో చూద్దాం పదండి.
కథ:
వరుణ్ అలియాస్ వీసీ (కార్తి) కాశ్మీర్లో ఇండియన్ ఏవియేషన్ ఫైటర్ పైలట్ గా పని చేస్తుంటాడు. అక్కడికి డాక్టర్ గా వస్తుంది లీలా (అదితి రావు హైదరి). ఓ యాక్సిడెంట్లో తీవ్ర గాయాలై తాను పని చేసే ఆసుపత్రికి వచ్చిన వీసీకి లీలానే చికిత్స చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరికి పరిచయం పెరిగి.. దగ్గరవుతారు. ఐతే ఇద్దరూ పెళ్లి వైపు అడుగులేస్తున్న సమయంలో వీసీ ప్రవర్తనతో ఇద్దరి మధ్య మనస్ఫర్థలు తలెత్తుతాయి. అదే సమయంలో కార్గిల్ యుద్ధం వస్తుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న వీసీ.. పాకిస్థాన్ సైన్యానికి చిక్కుతాడు. యుద్ధ ఖైదీగా పాకిస్థాన్ జైలుకు వెళ్తాడు. మరి అక్కడి నుంచి అతను బయటపడ్డాడా.. తిరిగి తన ప్రేయసిని కలిశాడా.. అన్నది తెరమీదే చూడాలి.
కథనం - విశ్లేషణ:
మణిరత్నం ఓ ప్రేమకథ తీస్తున్నాడంటే అందులో ప్రధానంగా జనాల్ని ఆకర్షించేది లీడ్ పెయిర్ కెమిస్ట్రీనే. ‘బొంబాయి’లో అరవింద్ స్వామి-మనీషా కొయిరాలా.. ‘సఖి’లో మాధవన్-షాలిని.. ‘ఓకే బంగారం’లో దుల్కర్ సల్మాన్-నిత్యా మీనన్.. ఇలా ఎన్నో జంటల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండించి.. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు మణి. ఈ సినిమాలన్నింటికీ అద్భుతమైన విజువల్స్.. మనసును తట్టే సంగీతం పెద్ద బలంగా నిలిచాయి. ‘చెలియా’లో కూడా కార్తి-అదితి రావు నిజంగా వీళ్లు నిజ జీవిత ప్రేమికులేమో అనిపించేంతగా కెమిస్ట్రీ పండింది. ఇక ఇందులో రవివర్మన్ ఛాయాగ్రహణం గురించి చెప్పాలంటే సినిమాటోగ్రఫీ క్లాసుల్లో దీన్నో పాఠం లాగా పెట్టేయొచ్చు. ఎ.ఆర్.రెహమాన్ హృద్యమైన నేపథ్య సంగీతం కూడా అంతే బాగా కుదిరింది. ఐతే ఈ అదనప ఆకర్షణలు ఎలా వున్నప్పటికీ సినిమాకు ఆత్మ అనదగ్గ కథాకథనాల దగ్గరే తేడా కొట్టేసింది. కంటెంట్.. ఫీల్ పరంగా మాత్రం ‘చెలియా’ మణిరత్నం గత ప్రేమకథలకు దరిదాపుల్లోకి కూడా రాదు. మణిరత్నం అభిమానులకే సంతృప్తినివ్వని ఈ చిత్రం సగటు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.
ప్రేమికుల మధ్య బంధంలోని గాఢతను.. వాళ్ల మధ్య సంఘర్షణను పొయెటిగ్గా చెప్పడంలో మణిరత్నం ముద్ర అక్కడక్కడా కనిపిస్తుంది కానీ.. ‘చెలియా’లో బలమైన కథే లేకపోయింది. చాలా పలచని స్టోరీ లైన్ ను పట్టుకుని రెండున్నర గంటల సినిమాగా సాగదీశాడు మణిరత్నం. కన్విన్సింగ్ గా అనిపించని హీరో పాత్ర సినిమాకు మైనస్ అయింది. తన దగ్గర కథ అంటూ పెద్దగా లేకపోవడంతో హీరో పాత్రనే అటు ఇటు ట్విస్ట్ చేసి.. దాని నేపథ్యంలోనే కథను లాక్కెళ్లినట్లుగా అనిపిస్తుంది. ‘బొంబాయి’కి ముంబయి అల్లర్లు.. ‘రోజా’కు ఉగ్రవాదం చక్కటి నేపథ్యాలుగా ఉపయోగపడినట్లుగా.. ‘చెలియా’కు కార్గిల్ యుద్ధ నేపథ్యం బలం కాలేకపోయింది. ఈ ఎపిసోడ్ ను నడిపించడంలో మణిరత్నం పూర్తిగా నిరాశ పరిచాడు. ఈ ఎపిసోడ్లో మణిరత్నం తనదైన ‘డెప్త్’ కానీ.. సన్నివేశాల్ని సహజంగా నడిపించే తన శైలిని కానీ చూపించలేకపోయాడు.
కథ బలంగా లేకపోవడం.. కార్గిల్ యుద్ధ నేపథ్యమూ అంత బలం కాకపోవడం.. ‘ఓకే బంగారం’ తరహాలో సినిమా అంత వినోదాత్మకంగానూ సాగకపోవడం వల్ల ‘చెలియా’ తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఐతే మణిరత్నం అభిమానులు ఆశించే కొన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ముందే అన్నట్లుగా లీడ్ పెయిర్ కెమిస్ట్రీ పండింది. రొమాన్స్ పండించడంలో ఇప్పటికీ తనకు తానే సాటి అని చాటిచెప్పాడు మణిరత్నం. కార్తి-అదితిల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బావున్నాయి. ఈ సన్నివేశాలకు చక్కటి కెమెరా పనితనం.. నేపథ్య సంగీతం తోడయ్యాయి. కార్తి-అదితి మధ్య ప్రథమార్ధంలో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేమ కథల్ని ఇష్టపడేవారిని ఆకట్టుకుంటాయి.
ఐతే ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల మధ్య పరిచయం.. ప్రేమ సన్నివేశాల వరకు పర్వాలేదనిపించిన మణిరత్నం.. ఆ తర్వాత మాత్రం కథను ముందుకు నడపడానికి చాలా ఇబ్బంది పడిపోయాడు. ద్వితీయార్దంలో అసలు కథ అసలు ముందుకే కదలదు. చాలా సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. ఒక దశ దాటాక కథ ఎటూ కదలకుండా లాక్ అయిపోతుంది. సినిమా మరీ సీరియస్ గా తయారవడం.. పైగా డైలాగ్స్ అన్నీ కూడా నిగూడార్థంతో.. సగటు ప్రేక్షకుడికి అర్థం కాని రీతిలో ఉండటంతో సమయం భారంగా గడుస్తుంది. హీరో పాకిస్థాన్ జైలు నుంచి తప్పించుకుని వచ్చే సన్నివేశాలు తేలిపోయాయి. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ కొంచెం కదిలించినా.. ‘చెలియా’ మణిరత్నం క్లాసిక్ లవ్ స్టోరీల్లా మాత్రం అనిపించదు. బలమైన కథ లేకపోవడం.. కథనం చాలా నెమ్మదిగా.. బోరింగ్ గా సాగడం మైనస్ అయ్యాయి. మణిరత్నం అభిమానులు కొందరికి ఆయన శైలిలో సాగే రొమాన్స్.. అద్భుతమైన విజువల్స్.. నేపథ్య సంగీతం నచ్చుతాయేమో కానీ.. సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇది తీవ్ర నిరాశ కలిగించే సినిమానే.
నటీనటులు:
కార్తి కి ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఒకటనడంలో సందేహం లేదు. తన ప్రేయసికి తన ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశాల్లో కార్తి నటన మెప్పిస్తుంది..క్లైమాక్స్ లో అయితే కార్తి తన హావభావాలతో కన్నీళ్లు తెప్పించేశాడు. కార్తిలో ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఎప్పుడూ చూసి ఉండరు. ఇక అదితిరావు తన టిపికల్ అందంతో.. హావభావాలతో ఆకట్టుకుంది. ఆమె కళ్లతో పలికించిన భావాలు వావ్ అనిపిస్తాయి. కార్తి కంటే కూడా సినిమాలో ఆమెదే బెటర్ క్యారెక్టర్. కార్తి-అదితి ఇద్దరూ కూడా మణిరత్నం ఆలోచనలకు.. ఆయన శైలికి తగ్గట్లుగా నటించారు. సినిమాలో ఇంకే పాత్రలకూ అంత ప్రాధాన్యం లేదు. అన్నీ చిన్న చిన్న.. సహాయపాత్రలే. ఆర్జే బాలాజీ పర్వాలేదు. ఢిల్లీ గణేష్ పాత్రకు అంత స్కోప్ లేదు.
సాంకేతికవర్గం:
రవివర్మన్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే.కాశ్మీర్ అందాల్ని అద్భుతంగా చూపించాడు రవివర్మన్. లొకేషన్ల వల్ల కూడా ఆయన కెమెరా పనితనం ఎలివేట్ అయింది. రెహమాన్ పాటలు ఓ మోస్తరుగా అనిపిస్తాయంతే. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. డైలాగ్స్ మణిరత్నం స్టయిల్లో సాగుతాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా చాలా రిచ్ గా తెరకెక్కింది. ఇక మణిరత్నం విషయానికొస్తే.. లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ పండించడంలో.. సాంకేతిక నిపుణుల నుంచి మంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలో మాత్రమే ఆయన తన ప్రత్యేకత చాటుకున్నాడు. సరైన కథాకథనాలు రాసుకోకపోవడంతో ఆయన ‘చెలియా’ను ప్రేక్షకులకు చేరువ చేయలేకపోయారు.
చివరగా: భారమైన.. చెలియా!
రేటింగ్-2.25/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre