Begin typing your search above and press return to search.

ఇది మెగా నందమూరి కెమిస్ట్రీ!

By:  Tupaki Desk   |   11 Nov 2018 12:06 PM GMT
ఇది మెగా నందమూరి కెమిస్ట్రీ!
X
సినీప్రియులు ఎంతకాలంగానో ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. రామ్ చరణ్.. జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ మల్టి స్టారర్ #RRR ఈరోజే లాంచ్ అయింది. చిరంజీవి.. ప్రభాస్ లాంటి ముఖ్య అతిథులతో పాటు ఎంతోమంది విశిష్ట అతిథులు కార్యక్రమానికి హాజరై #RRR టీమ్ కు తమ అభినందనలు తెలియజేశారు.

ఈవెంట్ లో అసలు హీరోలయిన చరణ్ ఎన్టీఆర్ లు ఇద్దరూ అందరితో నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక మిగతావారితో మాట్లాడడం ఒక ఎత్తైతే వారిద్దరిమధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే ఎవరికైనా మతిపోవడం ఖాయం. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉన్నారు. జోకులేసుకోవడం..నవ్వడమే కాకుండా ఒకరిపై ఒకరు చేతులేసుకొని మెగా - నందమూరి ఫ్యాన్స్ కు జాయింట్ గా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఇక హీరోలు ఇలా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటే అది కలిసి ఒకే సినిమాలో నటిస్తుంటే వారి ఫ్యాన్స్ ఫ్రెండ్స్ కాకుండా ఉంటారా?

ఇద్దరి మధ్యన ఆల్రెడీ ఉన్న కెమిస్ట్రీయేనా లేదా జక్కన్న ఏవైనా స్పెషల్ బీకాం కెమిస్ట్రీ పాఠాలు చెప్పి ఇద్దరినీ బెస్ట్ ఫ్రెండ్స్ గా మార్చేశాడా అని కొంతమంది నెటిజనులు జోకులు కూడా వేస్తున్నారు. ఏదైతేనేం లెండి. మనసారా నవ్వుతూ ఉన్న ఇద్దరినీ అలా చూస్తుంటేనే కడుపునిండిపోయేలా ఉంది. ఇక జక్కన్న సినిమాలో ఇద్దరినీ ఎలా మారుస్తాడో వేచి చూడాలి.

ఇక ఇదిలా ఉంటే సినిమా లాంచ్ సందర్భంగా ఈవెంట్ కు హాజరవడమే కాదు ట్విట్టర్ ద్వారా రానా దగ్గుబాటి ఇలా ట్వీట్ చేశాడు.."SS రాజమౌళి జునియర్ ఎన్టీఆర్.. జూనియర్ మెగాస్టార్ లను డైరెక్ట్ చేస్తున్నాడు. #RRR టీమ్ కు నా బెస్ట్ విషెస్."