Begin typing your search above and press return to search.
డిక్టేటర్ ని టెన్షన్ పెడుతున్న చెన్నై
By: Tupaki Desk | 11 Dec 2015 7:29 AM GMTచెన్నై వరదలు లక్షలాది మందికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. అనేక రంగాలకు పెద్ద దెబ్బే తగిలింది. వీటిలో సినిమా ఇండస్ట్రీ కూడా. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ కి కూడా చెన్నై ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. సంక్రాంతి రిలీజ్ కోసం రెడీ అవుతున్న బాలకృష్ణ మూవీ డిక్టేటర్ ని కూడా ఈ భారీ వర్షాలు ఇబ్బందుల్లోకి నెట్టాయి.
డిక్టేటర్ కు సంగీతం అందిస్తున్నాడు ఎస్ ఎస్ థమన్. ఈయ మ్యూజిక్ స్టూడియో వరదల్లో పూర్తిగా దెబ్బతింది. దాదాపు మూడున్నర కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని అంచనా. దీని నుంచి కోలుకోవడానికి, తిరిగి ఎక్విప్మెంట్ సెటప్ చేసుకునేందుకు సమయం బాగానే పడుతుంది. దీంతో డిక్టేటర్ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్ చేసేందుకు సాధ్యం కావడం లేదు. ఇప్పటికే సాంగ్స్ వర్క్ దాదాపుగా ఫినిష్ చేసేసినా, ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సహా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ సెటప్ చేసుకుని వర్క్ చేసేందుకుగాను, డిక్టేటర్ నిర్మాతలను థమన్ మరో నెల రోజులు సమయం కావాలని అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ టైం లేకపోతే, మణిశర్మను కానీ వేరే ఇతర మ్యూజిక్ డైరెక్టర్ ని కానీ తీసుకోవాలని సూచించాడట. అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమా మ్యూజిక్ థమన్ తోనే చేయించాలని భావిస్తున్నారట. దీంతో ఇచ్చిన రిలీజ్ డేట్ జనవరి 14ను అందుకోవడంలో డిక్టేటర్ నిర్మాతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.