Begin typing your search above and press return to search.
చెన్నై పోలీసులు రౌడీగారిని గుర్తించలేదట!
By: Tupaki Desk | 5 Oct 2018 10:50 AM GMTఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా విజయ్ దేవరకొండ కనిపిస్తే ఎమౌతుంది? జనాలు వెంటనే రౌడీగారి దర్శనానికి ఎగబడతారు. ఇక 'రౌడీ'లయితే సెల్ఫీల కోసం ట్రై చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సరే గానీ వేరే రాష్ట్రాల్లో అలా జరిగే అవకాశం లేదు. 'అర్జున్ రెడ్డి'.. 'గీత గోవిందం' సూపర్ హిట్ కావడంతో సౌత్ అంతా యూత్ లో మాత్రం విజయ్ పేరు అందరికీ తెలుసు. ముఖ్యంగా చెన్నై లో విజయ్ కి మంచి పాపులారిటీ ఉంది.
విజయ్ తాజా చిత్రం 'నోటా' తమిళంలో రిలీజ్ కానుండడంతో చెన్నైలో భారీ స్థాయిలోనే ప్రమోషన్స్ చేపట్టాడు విజయ్. ప్రమోషన్స్ లో భాగంగా వెరైటీగా ఓ ఆటో ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంటే ఆటో లో కూర్చుని చెన్నై సిటీలో తిరుగూతూ ఇంటర్వ్యూ అన్నమాట. అలా ఇంటర్వ్యూ జరుగుతూ ఉండగా మధ్యలో టీ కోసం ఒక చోట ఆపారు. కానీ టీ స్టాల్ దగ్గరకొచ్చిన పోలీసులు అక్కడి నుంచి వారిని తిప్పి పంపేశారు. వాళ్ళు విజయ్ దేవరకొండ ను గుర్తుపట్టక పోవడం విశేషమే. ఇక మిగతా ఇంటర్వ్యూను ఆటోలో తిరుగుతూ కంప్లీట్ చేశారు. 'నోటా' హిట్ అయితే అక్కడ ఇలాంటి పరిస్థితి మరోసారి రాకపోవచ్చు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ హైదరాబాద్ పోలీసులు చిల్ గైస్ అని.. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే తప్ప వారు మన జోలికి రారని అన్నాడు. అయినా ఇక్కడి పోలీసులకు దేవరకొండ ఎవరో తెలుసు కదా.. వాళ్ళెందుకు ఎందుకు ఆటో ఇంటర్వ్యూను ఆపుతారు? డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే మాత్రం ఆటో డ్రైవర్ ను బ్రీత్ అనలైజర్ లో ఊదమంటారు... జస్ట్ అంతే!