Begin typing your search above and press return to search.

13 వ స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి

By:  Tupaki Desk   |   16 Feb 2019 4:36 PM IST
13 వ స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి
X
చెన్నై భామ ఐశ్వర్య రాజేష్ పేరు తెలుసా? తమిళంలో దాదాపు పాతికకు పైగా సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ చేసిన ఐశ్వర్య ఈమధ్య హీరోయిన్ గా మారింది. 'కానా' పేరుతో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామాలో గ్రామా నేపథ్యం నుంచి వచ్చిన క్రికెటర్ పాత్రలో నటించి అందరినీ క్లీన్ బౌల్డ్ చేసింది. ఈ సినిమాలో ఐశ్వర్య తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించారు.

ఇదిలా ఉంటే ఈమధ్య ఐశ్వర్య చెన్నై టైమ్స్ వారు ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ లిస్టు 2018 లో మొదటిస్థానం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2017ఈ లిస్టులో ఐశ్వర్య 13 వ స్థానంలో ఉండడం విశేషం. ఈ విషయం తెలిసిన వెంటనే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా టైమ్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవార్డు తనకు ఎంతో విలువైనదని తెలిపింది.

ఇక ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే దాదాపు పది సినిమాలలో నటిస్తోంది. తమిళంలో ధనుష్ 'వడ చెన్నై-2'.. విక్రమ్ 'ధృవ నక్షత్రం' తో పాటు మరో అర డజను సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. త్వరలో విజయ్ దేవరకొండ - చంద్ర సిద్ధార్థ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఇసబెల్ తో పాటుగా మూడో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరో తెలుగు సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.