Begin typing your search above and press return to search.
చెర్రీ (X) తారక్: జక్కన్న జైలునుంచి తప్పించుకునేదెలా?
By: Tupaki Desk | 21 April 2021 4:30 PM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సారథ్యంలోని ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ లో రిలీజ్ కి సిద్ధం కావాల్సి ఉంది. అయితే సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రస్తుతం షూట్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమ పార్ట్ ని త్వరగా పూర్తి చేసి రిలీవ్ అయిపోవాలని చరణ్- తారక్ ఎంతో ఆత్రపడుతున్నా అది సాధ్యం కావడం లేదు. మహమ్మారీ అందరినీ వెంటపడి తరుముతోంది. ఏదేమైనా చిత్రీకరణ అంతకంతకు ఆలస్యమవుతుంటే ఆ ఇద్దరినీ బయటకు వెళ్లనీకుండా జక్కన్న భేడీలు వేశారు. మరి జక్కన్న జైలునుంచి తప్పించుకునేదెలా?
ఇప్పుడు అన్నిటినీ తెంచుకుని వెళ్లలేని పరిస్థితి. ఇది ఇలానే ఉంటే హీరోలిద్దరికీ ఇబ్బందే. చరణ్ ఓ వైపు శంకర్ తో సినిమా కోసం సన్నాహకాల్లో ఉన్నారు. మరోవైపు తారక్ తదుపరి కొరటాలతో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ దర్శకుడు మార్చి నాటికి మొత్తం షూట్ ను ముగించాలనుకున్నా అవ్వలేదు. ఆ తరువాత గడువును ఏప్రిల్ కు వాయిదా వేసారు. కానీ కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడంతో షూట్ ఆగిపోయింది. ప్రస్తుత మహమ్మారి కారణంగా ఇది ఎప్పటికి పూర్తవుతుందో తేలని పరిస్థితి. ఇలాంటప్పుడు తారక్ -చరణ్ ఎలా మ్యానేజ్ చేయాలి?
కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం కోసం బరువు తగ్గించాల్సిన అవసరం ఉన్నందున జక్కన్నతో షూటింగ్ పూర్తి చేయడానికి ఎన్టీఆర్ ముఖ్యంగా ఆత్రుతగా ఉన్నాడు. జక్కన్నతో షూట్ పూర్తయిన తర్వాత కొరటాల కోసం రెడీ అవ్వాల్సి ఉంది. రామ్ చరణ్ తన తదుపరి చిత్రానికి ప్రత్యేకమైన మేకోవర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అతను జూలై లేదా ఆగస్టులో శంకర్ సినిమా పని ప్రారంభిస్తాడు. అందువల్ల ఆర్.ఆర్.ఆర్ కి జక్కన్న ఎప్పుడు గుమ్మడికాయ కొడతాడో చెప్పాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించి నిర్మాత నామమాత్రమే. ప్రతిదీ రాజమౌళి అండ్ టీమ్ చూసుకుంటుంది కాబట్టి ఆన్సర్ అతడి నుంచే రావాల్సి ఉంది.