Begin typing your search above and press return to search.

చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్

By:  Tupaki Desk   |   20 Nov 2021 11:30 PM GMT
చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్
X
మాజీ ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన బయోపిక్ తెర‌కెక్క‌నుంద‌ని ధృవీకరించారు. కోల్ కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆనంద్ ఈ చిత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో సంగ‌తుల్ని ఆవిష్క‌రించ‌నుంద‌ని పేర్కొన్నాడు. `చదరంగం క్రీడాకారులు గ్రహాంతర గ్రహానికి చెందినవారు` అనే నమ్మకాన్ని ఈ చిత్రం తోసిపుచ్చుతుందని ఆయన అన్నారు.

ఇదే విషయం గురించి చెస్ గ్రాండ్ మాస్టర్ మాట్లాడుతూ... అతను తన జీవిత కథను నిర్మాతతో చాలాసార్లు పంచుకున్నానని త్వరలో స్క్రిప్ట్ పనులు ప్రారంభమవుతాయని చెప్పాడు. కోవిడ్ కారణంగా పనులు నిలిచిపోయాయని అయితే త్వరలో సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ పునఃప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెరపై త‌న పాత్ర‌లో ఏ నటుడు క‌నిపించాల‌ని ప్ర‌శ్నించ‌గా.. విశ్వనాథన్ సమాధానమిస్తూ ఈ సినిమాలో ఎవరు నటిస్తారనేది తనకు తెలియదన్నారు. అయితే అమీర్ ఖాన్ మాత్రం తన ఛాయిస్ అని చెప్పాడు. అమీర్ తో తనకు చాలా పోలికలు ఉన్నాయని చెప్పాడు.
ఆనంద్ ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే దానిపై ఎలాంటి లీకుల్ని ఇవ్వ‌లేదు. ఇదిలా ఉంటే ఆనంద్ ఎల్.రాయ్ ఈ బయోపిక్ కి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇత‌ర కెరీర్ మ్యాట‌ర్ కి వస్తే.. అమీర్ తదుపరి `లాల్ సింగ్ చద్దా`లో క‌నిపిస్తారు. కరీన్ కపూర్ ఖాన్.. నాగ‌చైత‌న్య త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2022 విడుదలకు ముస్తాబైంది.