Begin typing your search above and press return to search.

తప్పొప్పుకున్న అపర మేధావి

By:  Tupaki Desk   |   7 Oct 2018 7:53 AM GMT
తప్పొప్పుకున్న అపర మేధావి
X
ఎంత వారలైనా కాంత దాసులే అనే సామెత ఊరికే పుట్టలేదు. సీత మీద రావణుడి వ్యామోహం రామాయణానికి దారి తీస్తే ద్రౌపతి నవ్వు దాయాదుల మధ్య రక్తపాతం సృష్టించింది. దీనికి ఎవరూ అతీతులు కారని చరిత్ర రుజువు చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ విస్తృతమ్యాక ఏదైనా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. బాధితులు బలమైన ఆధారాలు సేకరించగలుగుతున్నారు.అందులో అడ్డంగా దొరికిపోయాడో విఖ్యాత రచయిత.

భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పుస్తకాలు చదివే అలవాటు ఉండే ఇక్కడి మూలలున్న ప్రతి పౌరుడికి బాగా సుపరిచితమైన పేరు చేతన్ భగత్. ఈయన నవల ఆధారంగా రూపొందిన అమీర్ ఖాన్ ౩ ఇడియట్స్ ఎంత సంచలనం రేపిందో ఎవరూ మర్చిపోలేరు. ఆయన రాసిన పుస్తకాలు నెలల తరబడి హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. సున్నితమైన అంశాల గురించి సరళమైన బాషలో రాసే ఈయన శైలికి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు.

అలంటి చేతన్ భగత్ కూడా స్త్రీ లోలుడని ఆయనే ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఓ మహిళా జర్నలిస్ట్ తో ఏర్పడిన పరిచయం ఆధారంగా చేతన్ భగత్ ఆమెతో లైంగిక సాన్నిహిత్యం ఆశించి ఆ మేరకు తన కోరికను వెల్లిబుచ్చుతూ మెసేజ్ పెట్టాడు. జాగ్రత్త పడిన సదరు జర్నలిస్ట్ వాటిని స్క్రీన్ షాట్ రూపంలో అన్ని భద్రపరిచింది. ఆ సమయానికే చేతన్ తో పాటు ఆ మహిళా జర్నలిస్ట్ కూడా వివాహితురాలే. అయినా చేతన్ అలా అడగడం షాక్ గురి చేసింది.

ఇప్పుడీ విషయం బయటికి వచ్చి సోషల్ మీడియాలో నానా రచ్చ కావడంతో చేతన్ భగత్ తన తప్పును ఒప్పుకుంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టేసాడు. తన భార్యతో సహా ఈ స్క్రీన్ షాట్స్ చూశానని అందులో అబద్దం అని చెప్పడానికి లేదని క్షమాపణ కోరాడు. అడిగిన మాట నిజమే కాని శారీరకంగా మాత్రం ఏది జరగలేదని కుండ బద్దలు కొట్టేసాడు. మొత్తానికి తప్పు కప్పిపుచ్చుకుంటే అది ఇంకా రచ్చ అవుతుందని గుర్తించి చాలా తెలివిగా ఒప్పేసుకున్న చేతన్ భగత్ లో ఈ మాత్రం నిజాయితి ఉన్నందుకు సంతోషించాలి. అవన్నీ ఫేక్ అని వాదించకుండా ధైర్యంగా అవును అడిగి తప్పు చేశాను అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి.