Begin typing your search above and press return to search.
క్యాన్సర్ తో 'ఛెల్లో షో' చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
By: Tupaki Desk | 11 Oct 2022 7:05 AM GMTఈ ఏడాదికి గాను ఇండియా తరపున ఆస్కార్ నామినేషన్స్ ఎంట్రీ దక్కించుకునేందుకు ఆర్ఆర్ఆర్ తో పాటు పలు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో గుజరాతీ సినిమా ఛెల్లో షో కి ఆస్కార్ ఎంట్రీకి అర్హత దక్కింది. ఇండియా తరఫున అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ దక్కించుకున్న ఛెల్లో షో కథ పిల్లల చుట్టూ తిరుగుతుంది.
పిల్లలు సినిమా గురించి ఆలోచించే విధానం.. వారి యొక్క మానసిక స్థితిని చక్కగా దర్శకుడు చూపించాడు. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా ఆ పిల్లలు కూడా అద్భుతంగా పండించారు అంటూ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ ఛెల్లో షో లో నటించిన ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మృతి చెందిన వార్త ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది.
సినిమాలో రైల్వే సిగ్నల్ మ్యాన్ కుమారుడు... సినిమాలో కీలక పాత్రలో నటించే సమయ్ కి బెస్ట్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన రాహుల్ కోలీ అక్టోబర్ 2వ తారీకున క్యాన్సర్ తో మృతి చెందాడట. ఈ విషయాన్ని రాహుల్ తండ్రి కాస్త ఆలస్యంగా మీడియా ముందుకు తీసుకు వచ్చాడు.
రాహుల్ కోలీ మృతి విషయమై అతడి తండ్రి మాట్లాడుతూ... అక్టోబర్ 2న ఉదయం టిఫిన్ చేశాడు.. జ్వరం వచ్చి రెండు మూడు సార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత చనిపోయాడు. లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతున్న కోలీ ని కాపాడేందుకు చాలా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట.
క్యాన్సర్ పోరాడుతూనే ఛెల్లో షో సినిమా లో రాహుల్ నటించాడు. అక్టోబర్ 14న విడుదల కాబోతున్న సినిమాలో మా రాహుల్ ని చూసుకుంటామని తండ్రి చేసిన వ్యాఖ్యలు అందరిని కలచి వేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.