Begin typing your search above and press return to search.
అంతర్థానమైన హీరో చైనాలో చోరీలు?
By: Tupaki Desk | 14 Jan 2022 7:30 AM GMTక్రీడా బాయోపిక్ లకు చైనాలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంతకుముందు మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చైనాలో రికార్డ్ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మంచి రిజల్ట్ ను అందుకుంది. కానీ బాహుబలి ఫ్రాంఛైజీ కానీ ఈ తరహా సినిమాలు కానీ ఆశించినంత విజయాల్ని నమోదు చేయలేకపోయాయి.
తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే చైనాలో విడుదలైంది. ఈ సినిమా ఆశించిన రేంజులో లేకపోయినా డీసెంట్ కలెక్షన్లను సాధిస్తోందని రిపోర్ట్ అందింది. పాండమిక్ ఇబ్బంది బాక్సాఫీస్ వద్ద ప్రతిఫలిస్తోంది. లేదంటే వసూళ్లు బెటర్ గా ఉండేవని భావిస్తున్నారు. చిచోరే చైనా బాక్స్ ఆఫీస్ వివరాల్నిపరిశీలిస్తే.. ఈ చిత్రం 1వ వారం 2.07 మిలియన్ అమెరికా డాలర్లను వసూలు చేసింది.
నితేష్ తివారీ దర్శకత్వం వహించిన చిచోరే చిత్రం 2019లో విడుదలైంది. ఇది కేవలం వారం క్రితం చైనాలో విడుదలైంది. మంచి స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీకి చైనాలో తొలుత మంచి టాక్ వచ్చింది. కానీ కొనసాగుతున్న మహమ్మారి వల్ల సినిమా వ్యాపారం ప్రభావితమైనట్లు కనిపిస్తోందని ట్రేడ్ వెల్లడిస్తోంది. ఇప్పటికి దాదాపు 2.07 మి. USD వసూలు చేసింది. అంటే సుమారు రూ. 15.31 కోట్లు కలెక్టయ్యిందన్నమాట. ఏది ఏమైనా తక్కువ కలెక్షన్లు ఉన్నప్పటికీ ఛిచోర్ 2.07 మిలియన్ USD చేయడం ఇప్పటి పరిస్థితిలో గొప్ప అని విశ్లేషిస్తున్నారు. ఛిచోర్ మునుపటి బాలీవుడ్ విడుదలల విజయాన్ని ప్రతిబింబించలేదు. బాహుబలి- ది కన్ క్లూజన్- సీక్రెట్ సూపర్ స్టార్- హిందీ మీడియం వసూళ్లు అప్పట్లో ఫర్వాలేదనిపించాయి. గతంలో విడుదలైన కాబిల్- 102 నాటౌట్- దంగల్- సుల్తాన్ - మామ్ చిత్రాలు ఛిచోర్ కంటే మెరుగైన ప్రదర్శనను కనబరిచాయి. అయితే అప్పట్లో క్రైసిస్ లేకపోవడం వాటికి కలిసొచ్చిందని విశ్లేషిస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చిత్రం చైనాలో థియేటర్లలో కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి చైనా బాక్సాఫీస్ వద్ద రెండవ వారాంతంలో చిచ్చోర్ కలెక్షన్లలో చిన్నపాటి పెరుగుదల కనిపించిందని చెబుతున్నారు. సుశాంత్ లేకపోయినా చైనాలో ఆడిస్తున్నారు! ఇంతకంటే ఏం కావాలి! తాను ఇహలోకంలో లేకపోయినా విదేశీయుల మనసులు దోచి 15 కోట్లు ఇప్పటికే కొల్లగొట్టాడు!