Begin typing your search above and press return to search.
కిలాడీతో పోటీ పడిన ఏకైక సౌత్ స్టార్
By: Tupaki Desk | 13 Sep 2019 1:30 AM GMTడార్లింగ్ ప్రభాస్ నటించిన `సాహో` తెలుగు-తమిళం కంటే హిందీలో బంపర్ హిట్ కొట్టింది. ఇక్కడ పంపిణీదారుల్లో రెవెన్యూ నష్టాల గురించి చర్చ సాగుతుంటే అక్కడ పంపిణీదారులు ఖుషీగా ఉన్నారని తెలుస్తోంది. ఓవైపు కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `మిషన్ మంగళ్` స్థిరంగా వసూళ్లు సాగిస్తున్నా.. అతడి సినిమాతో పోటీపడుతూ ప్రభాస్ `సాహో` అసాధారణ విజయం సాధించడం హాట్ టాపిక్ గా మారింది. ఖాన్ లు.. కిలాడీలే మన డార్లింగ్ సత్తా గురించి ఆరా తీసే సన్నివేశం వచ్చింది ఈ సక్సెస్ తో. ఆరడుగుల దక్షిణాది కటౌట్ హిందీ వోళ్లకు పిచ్చిగా నచ్చేసిందనడానికి ఇంతకంటే ఏం ప్రూఫ్ కావాలి.
కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన `మిషన్ మంగళ్` ఓపెనింగుల్లో పరమ వీక్ గా మొదలైంది. ఆగస్టు 15 హాలీడే అయిన శుక్రవారం నాడు రిలీజైన మిషన్ మంగళ్ తో పోలిస్తే.. డార్లింగ్ ప్రభాస్ నటించిన `సాహో` తొలి మూడు రోజులు అద్భుత వసూళ్లు సాధించింది. సాహో క్రేజుకి హిందీ బాక్సాఫీస్ షేక్ అయ్యింది. శుక్రవారం (ఆగస్టు 30)- 24.4 కోట్లు.. శని-25.2 కోట్లు.. ఆది-29.48కోట్లు, సోమ-14.2కోట్లు.. మంగళవారం-9.1కోట్లు.. బుధ-6.9 కోట్లు.. గురు-6.75కోట్లు.. శుక్ర-3.75 కోట్లు .. శని-4.6 కోట్లు.. ఆది-6.6కోట్లు (8వ రోజు) వసూలు చేసింది. ఓవరాల్ గా ఇప్పటివరకూ 137 కోట్ల షేర్ వసూలు చేసిందని హిందీ ట్రేడ్ వెల్లడించింది. ఇంకా అక్కడ సాహో విజయవంతంగా రన్ అవుతోంది.
ఇక కిలాడీ అక్షయ్ కుమార్ నటించిన `మిషన్ మంగళ్` తొలి వారం 128 కోట్ల వసూళ్లు సాధించి.. ఇప్పటికి 198 కోట్ల వసూళ్లను అధిగమించింది. ఒక రకంగా హిందీలో ప్రభాస్ 3 సినిమాల కిడ్ అయినా అక్షయ్ తో పోటీపడుతూ ధీటైన వసూళ్లు సాధించాడనే చెప్పాలి. అక్షయ్ సినిమా 8 రోజుల్లో 130 కోట్లు వసూలు చేస్తే ఇంచుమించు.. ప్రభాస్ సినిమా 8రోజుల్లో 116 కోట్లు.. వసూలు చేసింది అంటే డార్లింగ్ స్టామినా ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి1.. బాహుబలి 2.. సాహో చిత్రాలతో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా అంగీకరించినట్టే. అయితే అక్షయ్ నటించిన `మిషన్ మంగళ్` పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి అక్షయ్ స్టార్ డమ్ వల్ల అంత వసూలు చేసింది.. కాగా ప్రభాస్ నటించిన సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా.. దానికి ప్రభాస్ స్టామినా అస్సెట్ గా నిలిచిందని గుర్తుంచుకోవాలి. ఇక ప్రభాస్- అక్షయ్ సినిమాలతో పాటు యువహీరో విక్కీ కౌశల్- శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిచ్చోరే ఈ సీజన్ లోనే వచ్చి హిట్ కొట్టింది.