Begin typing your search above and press return to search.
'సైరా' కి సూపర్ స్టార్ల ప్రచారం కలిసొస్తుందా?
By: Tupaki Desk | 6 Sep 2019 5:09 AM GMT`సాహో` తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `సైరా`. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రలో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు. బంధిపోటు దొంగగా.. తెల్లదొరలపై తిరుగుబాటు చేసే విప్లవ వీరుడిగా కనిపించనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. గాంధీ జయంతి సెలవు మొదలు దసరా సెలవుల్ని కవర్ చేసేలా రిలీజ్ ని పకడ్భందీగా ప్లాన్ చేసింది కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ.
అందుకు తగ్గట్టే ప్రచారంలోనూ నూతన ఒరవడిని సృష్టించేందుకు రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి బృందం పక్కాగా ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈనెల 10న తొలి సింగిల్ రిలీజ్ కానుంది. అటుపై 15న కర్నూల్ లో ప్రీరిలీజ్ వేడుకను లక్ష మంది మెగాభిమానుల సమక్షంలో నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నారని తెలిసింది. అలాగే అన్ని మెట్రో నగరాల్లోనూ మల్టీప్లెక్స్ క్రౌడ్ ని పుల్ చేసే దిశగా భారీగా ఈవెంట్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమా ప్రచారంలోకి దిగ్గజాల్ని దించుతున్నారన్నది తాజా అప్ డేట్. బిగ్ బి అమితాబ్ .. రజనీకాంత్.. పవన్ కల్యాణ్.. సుదీప్.. మోహన్ లాల్ .. సహా అన్ని భాషల స్టార్లను ఇన్వాల్వ్ చేస్తారట. తద్వారా సైరాకి కావాల్సినంత హైప్ తేవాలన్నది ప్లాన్. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తారని తెలుస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ని తమిళ ప్రమోషన్స్ కోసం.. మలయాళం కోసం సూపర్ స్టార్ మోహన్ లాల్ ని.. మెగాస్టార్ స్వయంగా సాయం కోరతారని చెబుతున్నారు. అయితే ఇంత హైప్ తెస్తే సైరాలో కంటెంట్ కూడా ఆ రేంజులోనే ఉంటుందా అన్నది త్వరలో రివీల్ చేసే ప్రచార సామాగ్రి తేలుస్తుందేమో. టీజర్.. మేకింగ్ వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది. ట్రైలర్ తో పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమాన సంఘాల ప్రచారం ఈ సినిమాకి పెద్ద ప్లస్ కానుంది.
అయితే `సాహో` లాంటి భారీ చిత్రం అమెరికా సహా చాలా చోట్ల ఆశించిన స్థాయి వసూళ్లను సాధించకపోవడంతో ఆ ప్రభావం సైరా బిజినెస్ పైనా పడిందన్న ప్రచారం సాగుతోంది. మరి వీటన్నిటినీ కొణిదెల కంపెనీ ఎలా ఓవర్ కమ్ చేస్తూ ప్రచారంలో వేడి పెంచడం ద్వారా అనుకున్నది సాధిస్తుందా అన్నది చూడాలి.